ఈడీ ఎదుటకు జగపతి బాబు

సాహితీ ఇన్ ఫ్రా కేసులో నటుడు జగపతిబాబును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు

Update: 2025-09-25 12:58 GMT

సాహితీ ఇన్ ఫ్రా కేసులో నటుడు జగపతిబాబును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. ఈడీ అధికారులు జగపతిబాబును నాలుగు గంటలు సమయం ప్రశ్నించారు. సాహితీ ఇన్ ఫ్రా సంస్థ ప్రకటనల్లో జగపతి బాబు నటించారు. సాహితీ ఇన్ ఫ్రా సంస్థ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ అధికారులు విచారించారు.

సాహితీ ఇన్ ఫ్రా సంస్థ ప్రకటనల్లో...
సాహితీ ఇన్ ఫ్రా సంస్థ ప్రకటనల్లో నటించినందుకు ఆయనకు అందిన పారితోషికం, చెల్లింపుల మార్గాలపై ఎన్ ఫోర్స్ మెట్ డైరెక్టరేట్ అధికారులు వివరాలు సేకరించినట్టు సమాచారం. ఆ లావాదేవీల గురించి ఆరా తీసిన అధికారులు ఆ సంస్థ ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకర్షించి సుమారు 700 మంది నుంచి రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసి మోసానికి పాల్పడిందనేది ప్రధాన ఆరోపణ. ఈ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రకటనల్లో నటించినందుకే ఆయన్ను సాక్షిగా విచారించారని తెలిసింది.


Tags:    

Similar News