Bus Accident : హైదరాబాద్ కు చెందిన ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతులు
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉన్నారని తెలిసింది
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉన్నారని తెలిసింది. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరి మక్కాకు బయలుదేరి వెళ్లారు. మొత్తం 44 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఆల్ మక్కాట్రావెల్స్ నుంచి 20 మంది, ఫ్లై జోన్ ట్రావెల్స్ నుంచి 24 మంది ఉన్నారు. 42 మంది మరణించగా అందులో పదహారు మంది హైదరాబాద్ కు చెందిన వారున్నట్లు ఇప్పటి వరకూ గుర్తించారు. మల్లేపల్లి, బజార్ ఘాట్ కు చెందిన వారు కూడా కొందరు ఉన్నారని చెబుతున్నారు. రాత్రి నుంచి ఫోన్లలోకి కూడా అందుబాటులోకి రాకపోవడంతో మక్కా కు వెళ్లిన వారి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
42మంది సజీవదహనమయిన కేసులో...
మక్కా నుంచి మదీనాకు వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొంటడంతో మంటలు చెలరేగి 42 మంది సజీవ దహనమయ్యారు. డ్రైవర్ తో పాటు షోయబ్ అనే యువకుడు తప్ప మిగిలిన సజీవ దహనమయ్యారని తెలిసింది. ప్రాణాలతో బయటపడిన షోయబ్ హైదరాబాద్ లోని తమ బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. హైదరాబాద్ లోని రెండు ట్రావెల్స్ నుంచి మక్కా కు టిక్కెట్లు బుక్ చేసుకుని వెళ్లారు. అక్కడి నుంచి నలుగురు మాత్రం కారులో మక్కా నుంచి మదీనాకు బయలుదేరారు. ఈ బస్సు ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన పదిహేను మంది మరణించారని చెబుతున్నారు. ఒక కుటుంబంలో ఎనిమిది మంది, మరొక కుటుంబంలో ఏడుగురు ఈ ప్రమాదంలో మరణించారని ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. మృతుల్లో హీమున్నీసా, రహత్ బీ, షేహనాబ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూర్, మహ్మద్ అలీగా గుర్తించారు.
మక్కా నుంచి మదీనా వెళుతుండగా...
మిగిలిన వారిలో కూడా ఎక్కువ మంది భారతీయులున్నారని చెబుతున్నారు.. ఈ ఘటన బదర్ - మదీనా మధ్య ముఫరహత్ దగ్గరలో జరిగింది. సెల్ ఫోన్లు స్విచ్చాఫ్ అవుతుండటంతో ఈ ప్రమాదంలో వారు ఏమయ్యారన్న ఆందోళనలో బాధితులు ఉన్నారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం అలుముకుంది. వారంతా ట్రావెల్స్ కంపెనీ కార్యాలయాలకు చేరుకుని తమ వారి ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు. దీంతో ప్రభుత్వం వారి వివరాలను కనుగొనాలని అధికారులను ఆదేశించారు.