Mohan Babu : మోహన్ బాబు హెల్త్ రిపోర్టులో ఏముందంటే?
సినీనటుడు మోహన్ బాబు హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు.
సినీనటుడు మోహన్ బాబు హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. ఆయన నిన్న రాత్రి కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. బీపీ పెరగడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. బీపీ 200 తో మోహన్ బాబు ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. మోహన్ బాబు ఎడమకంటికి స్వల్ప గాయమయిందని కాంటినెంటల్ వైద్యులు తెలిపారు. మోహన్ బాబు స్థిమితంగా లేరని, మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు.
సిటీ స్కాన్ చేసిన తర్వాత...
ఫేస్ సిటీ స్కాన్ చేసిన తర్వాత పూర్తి విషయం తెలుస్తుందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. మరికొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మోహన్ బాబు కు మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉందని, పరీక్షలు చేసిన తర్వాత మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని తెలిపారు.