నేడు ఈడీ ఎదుటకు దగ్గుబాటి రానా
బెట్టింగ్ యాప్స్ కేసులో నేడు దగ్గుబాటి రానా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు
బెట్టింగ్ యాప్స్ కేసులో నేడు దగ్గుబాటి రానా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే రానాకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో నేడు దగ్గుబాటి రానా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు హాజరయ్యే అవకాశముంది. ఇప్పటికే ఇదే కేసులో ప్రకాశ్ రాజ్, విజయ్ దేవర కొండలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు.
బెట్టింగ్ యాప్స్ పై...
బెట్టింగ్ యాప్స్ పై మొత్తం 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసింది. వీరిలో ఒక్కొక్కరినీ విచారిస్తుంది. బెట్టింగ్ యాప్స్ లో పాల్గొన్న వారందరినీ విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అందరికీ నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారన్న ఆరోపణలున్నాయి. ఇదే కేసులో ఈ నెల 13వ తేదీన మంచులక్ష్మి కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు.