హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం గెలుపు
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఎంఐఎం విజయం సాధించింది
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి గెలిచారు. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ గెలుపొందారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా తక్కువ ఓట్లు కావడంతో వెంటనే కౌంటింగ్ ముగిసింది.
రెండు పార్టీల మధ్య...
ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు మాత్రమే పోటీ పడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి.మొత్తం 112 ఓట్లు ఉంటే కేవలం 88 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎంఐఎం అభ్యర్థికి 63 ఓ్లు రావడంతో మీర్జా రియాజ్ ఉల్ హాసన్ ను విజేతగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం సులువుగా విజయం సాధించింది.