Jubleeehills By Elections : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది

Update: 2025-10-09 01:47 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో నవీన్ యాదవ్ కుటుంబానికి మంచి పట్టు ఉండటంతో పాటు బస్తీల్లోనూ వారికి అధికంగా ఓట్లు వస్తాయని భావించి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటనలో తెలిపారు. మొత్తం ముగ్గురు అభ్యర్థుల పేర్లను హైకమాండ్ కు పీసీసీ పంపింది. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీకే రెడ్డి పేర్లను హైకమాండ్ కు పంపగా నవీన్ యాదవ్ పేరును పార్టీ నాయకత్వం ఖరారు చేసింది.

గతంలో పోటీ చేసి ఓటమి పాలయి...
2014 ఎన్నికల్లో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కార్పొరేటర్ గా పోటీ చేశారు. నియోజకవర్గంలో శ్రీశైలం యాదవ్ కుమారుడిగా నవీన్ యాదవ్ కు మంచి పట్టు ఉండటం వల్లనే ఆయన పేరును ఖరారు చేసింది. నవ యువ ఫౌండేషన్ పేరుతో నియోజకవర్గంలో పలు సేవలను నవీన్ యాదవ్ అందిస్తున్నారు. మాగంటి గోపీనాధ్ మరణంతో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆయన సతీమణి సునీత పేరును ముందుగానే నిర్ణయించింది. బీజేపీ కూడకా ఇక్కడ ఈరోజు, రేపట్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది.


Tags:    

Similar News