చలాన్ల క్లియరెన్స్ ద్వారా ఇంత ఆదాయం వచ్చిందా?

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు భారీ స్పందన లభిస్తుంది

Update: 2022-03-25 07:33 GMT

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు భారీ స్పందన లభిస్తుంది. ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు అవకాశం ఇచ్చారు. స్వచ్ఛందంగా తమ చలాన్లను క్లియర్ చేసుకోవాలని పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. దాదాపు 600 కోట్ల రూపాయల చలాన్లు వసూలు కావాల్సి ఉండటంతో భారీగా రాయితీలను పోలీసు శాఖ ప్రకటించింది. ద్విచక్ర వాహనాలకు 75 శాతం రాయితీ ప్రకటించారు.

190 కోట్ల వసూలు...
మార్చి 1వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ మొత్తం 1.58 కోట్ల చలాన్లకు సంబంధించి వాహనదారులు చెల్లించారని పోలీసు శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటి వరకూ చలాన్లను చెల్లించడం ద్వారా ఖజానాకు 190 కోట్ల రూపాయలు వసూలయింది. అయితే ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ ను పొడగించే అవకాశం లేదని పోలీసు అధికారులు చెప్పారు.


Tags:    

Similar News