నేడు చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభం

చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ నేడు ప్రారంభం కానుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు.

Update: 2022-08-23 03:24 GMT

చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ నేడు ప్రారంభం కానుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. 45.79 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. మొత్తం నాలుగు లైన్లతో 674 మీటర్ల పొడవుతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. కందిగల్ గేట్, బార్కస్ జంక్షన్ల వద్ద ఆగకుండా ట్రాఫిక్ నేరుగా క్లియర్ అవుతుంది. ఈ ప్లైఓవర్ నిర్మాణం కారణంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి.

ట్రాఫిక్ సమస్యలు...
ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఎల్బీనగర్ మీదుగా నల్లగొండ వెళ్లేందుకు మార్గం సుగమమయింది. ఎస్ఆర్డీపీ కింద హైదరాబాద్ నగరంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం 41 పనులు చేపట్టింది. వీటిలో 30 పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణాలను జీహెచ్ఎంసీ యుద్ధప్రాతిపదికనపైన చర్యలు తీసుకుంది.


Tags:    

Similar News