నటి కల్పికపై కేసులు నమోదు

నటి కల్పిక గణేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2025-06-12 07:02 GMT

నటి కల్పిక గణేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్ చెల్లించకుండా తమ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని కల్పికపై ప్రిజం పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దీంతో సంబంధిత సెక్షన్స్ ఆధారంగా కల్పికపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బర్త్ డే కేక్ విషయమై ప్రిజం పబ్ నిర్వాహకులకు, కల్పికకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.


దీంతో పబ్‌ నిర్వాహకులు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో కల్పికపై కేసు నమోదు చేశారు. తమపై ప్లేట్లు విసిరేయడంతో పాటు బాడీ షేమింగ్‌ కూడా కల్పిక చేశారని ప్రిజం సిబ్బంది తెలిపారు. పబ్‌ యాజమాన్యంపై కల్పిక కూడా కేసు పెట్టారు. గొడవకు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.

Tags:    

Similar News