Hyderabad : ఫ్లైఓవర్ పై కారు అదుపు తప్పి బోల్తా

హైదరాబాద్ లో ఫ్లైఓవర్ పై కారు అదుపు తప్పి బోల్తా పడింది.

Update: 2026-01-21 04:32 GMT

హైదరాబాద్ లో ఫ్లైఓవర్ పై కారు అదుపు తప్పి బోల్తా పడింది. బేగంపేట ఫ్లై ఓవర్ పై ఈ ఘటన జరిగింది. డివైడర్ ను ఢొకట్టి అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా...
వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వెంటనే బేగంపేట్ ఫ్లై ఓవర్ వద్దకు చేరుకుని అక్కడ ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. కాను అక్కడి నుంచి తొలగించారు. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనతో అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News