బాలకృష్ణ ఇంటి వద్ద కారు ప్రమాదం

సినీనటుడు బాలకృష్ణ ఇంటి దగ్గర ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు ప్రమాదానికి గురయింది

Update: 2025-03-14 04:02 GMT

హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. సినీనటుడు బాలకృష్ణ ఇంటి దగ్గర ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు ప్రమాదానికి గురయింది జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కారు మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 45 మీదుగా చెక్ పోస్టుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

అతి వేగంగావచ్చి...
ప్రమాదంలో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్ దెబ్బతినింది. అలాగే కారు కూడా డ్యామేజీ అయింది. అయితే డ్రైవర్ నిద్రమత్తులో అతి వేగంగా వచ్చి కారును ఫెన్సింగ్ డీకొట్టారని కొందరు చెబుతున్నారు. కానీ ఆసమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News