KTR : నేడు తెలంగాణ భవన్ కు కేటీఆర్
నేడు తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు.
నేడు తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప్పసర్పంచులతో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి వార్డు సభ్యులను కూడా ఆహ్వానించారు. ఇటీవల రెండు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని కేటీఆర్ అభినందించనున్నారు.
గెలిచిన వారిని...
అధికార పార్టీ వత్తిడులకు తలొగ్గి, ప్రలోభాలను అధిగమించి పార్టీ కోసం నిలబడిన వారిని కేటీఆర్ అభినందించనున్నారు. అలాగే ఇక ఎన్నికల తర్వాత రాజకీయాలను వదిలేసి గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలని కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం నుంచి నిధులను డిమాండ్ చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని వారిని కోరనున్నారు.