Hyderabad : నేడు హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఆందోళన

ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ నేడు హైదరాబాద్ నగరంలో ఆందోళన చేయాలని నిర్ణయించింది

Update: 2025-10-27 02:50 GMT

బీఆర్ఎస్ హైదరాబాద్ లో నేడు ఆందోళనకు దిగనుంది. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ నేడు హైదరాబాద్ నగరంలో ఆందోళన చేయాలని నిర్ణయించింది. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లకు జీవనం ఇబ్బందిగా మారిందని భావిస్తూ వారికి ఆర్థిక సాయం అందచేయాలని ఆటో కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

ఆటోలో ప్రయాణిస్తూ...
ఆటో డ్రైవర్ల సమస్యలకు అండగా నిలవాలని, వారికి మద్దతుగా పోరాటం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆటోల్లో ప్రయాణిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు ఆటోలో ప్రయాణిస్తూ వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకుంటారు.


























Tags:    

Similar News