Bonalu : నేడు ఆషాఢమాసం మొదటి ఆదివారం బోనాలు
ఆషాఢమాసం మొదటి ఆదివారం నాడు తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఆషాఢమాసం మొదటి ఆదివారం నాడు తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఘనంగా బోనాల పండగ ప్రారంభమయింది. ఈరోజు నుంచి నాలుగు ఆదివారాలు జంటనగరాల్లో బోనాల సందడి నెలకొంటుంది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు పెద్దయెత్తున ఆలయాలకు తరలి వస్తున్నారు.
గోల్కొండ కోట జగదాంబిక...
ఈరోజు గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి అమ్మవారికి రెండో రోజు బోనాలను సమర్పించనున్నారు. ఆషాఢమాం ప్రారంభమైన గురువారం నాడు తెలంగాణ ప్రభుత్వం మొదటి బోనం సమర్పించింది. నేడు గోల్కొండకు వేలాది మంది భక్తులు బోనం సమర్పించేందుకు తరలి రానున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఇక్కడ బోనాలను సమర్పిస్తుంటారు. ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.