Hyderabad : బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో సిబ్బందిని బయటకు పంపించి బాంబ్ స్కాడ్ తనిఖీలను నిర్వహించింది. అయితే తనిఖీల తర్వాత ఎటువంటి బాంబులు లేవని బాంబ్ స్కాడ్ నిర్ధారించింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తరచూ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం పరిపాటిగా మారింది.
ఎవరు చేశారన్న దానిపై...
అయితే బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ చేసింది ఎవరన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆకతాయిల పనే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. తరచూ విమానాలు తిరిగే వాటికి బాంబు ఈ మెయిల్స్ రావడం సాధారణంగా మారింది. మరి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు ఎవరు కాల్ చేసి ఉంటారన్న దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.