భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ చేస్తాం
భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు.
భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. లక్షలాది మంది భక్తులు భాగ్య లక్ష్మీ అమ్మ వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, తమ పార్టీ అగ్ర నాయకులైన అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అమ్మవారి కృపకు పాత్రులయ్యారన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం రావడం తన అదృష్టమని తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్నాకే ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అయిందని, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచిందన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారు లేనే లేదని, బండి సంజయ్ కొత్త కొట్లాట పెడుతున్నారని గతంలో
కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు హేళన చేశారని చెప్పారు. నాడు హేళన చేసిన వాళ్లే నేడు అమ్మవారి శక్తి తెలుసుకుని దర్శనం చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఇదే భాగ్యలక్ష్మి టెంపుల్‌ను గోల్డెన్ టెంపుల్‌గా తీర్చిదిద్దుతామని బండి సంజయ్ అన్నారు.