Hyderabad : నేడు కీలక నేత బర్సే దేవా లొంగుబాటు

ఈరోజు మావోయిస్టు పార్టీ కీలక నేత బర్సే దేవా పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు

Update: 2026-01-03 05:58 GMT

వరస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు.ఇందులో భాగంగా ఈరోజు మావోయిస్టు పార్టీ కీలక నేత బర్సే దేవా లొంగిపోనున్నారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట బర్సే దేవా లొంగిపోతారని అధికారులు తెలిపారు. బర్సే దేవా ప్రస్తుతం మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా ఉన్నారు.

హిడ్మా స్థానంలో...
బర్సే దేవా ఇటీవల ఎన్ కౌంటర్ లో మరణించిన హిడ్మా స్థానంలో నియమితులయ్యారు. హిడ్మా, బర్సే దేవా ఒకే గ్రామానికి చెందిన వారు. ఆయుధాల సరఫరాలో కీలక పాత్ర పోషించిన దేవాతో పాటు మరొక పందొమ్మిది మంది సభ్యులు లొంగిపోనున్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం పునరావాసం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News