కరోనా మిగిల్చిన విషాదం.. కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

కుత్బుల్లాపూర్ లోని ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని తనిఖీలకు వెళ్లిన బాలానగర్ జోన్ ఎస్ఓటి కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందారు

Update: 2025-06-22 04:02 GMT

కరోనా వైరస్ సోకిన వారిలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బూస్టర్ డోస్ లు వేసుకున్న తర్వాత గుండెపోటు మరణాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రధానంగా యువత గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారని వైద్యులు అంటున్నట్లే జరుగుతుంది. తాజాగా కుత్బుల్లా పూర్ లో ఒక యువ కానిస్టేబుల్ గుండెపోటుతో కుప్ప కూలి ప్రాణాలు వదిలిన ఘటన ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది.

39 ఏళ్ల ప్రవీణ్...
కుత్బుల్లాపూర్ లోని ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని తనిఖీలకు వెళ్లిన బాలానగర్ జోన్ ఎస్ఓటి కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందారు.నిల్చున్న చోటే ప్రవీణ్ కుప్పకలిపోయాడు. ప్రవీణ్ వయసు 39 సంవత్సరాలు. గమనించిన తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కానిస్టేబుల్ ప్రవీణ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News