హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్ లో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు

Update: 2025-09-16 05:39 GMT

హైదరాబాద్ లో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు. విద్యుత్తు శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి పదిహేను బృందాలుగా విడిపోయి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

విద్యుత్తు శాఖకుచెందిన ఏడీఈ అంబేద్కర్...
విద్యుత్తు శాఖకుచెందిన ఏడీఈ అంబేద్కర్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఈ సోదాలను ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. అంబేదర్కర్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. భారీగా ఆస్తులను గుర్తించినట్లు తెలిసింది.


Tags:    

Similar News