Manchu Mohan Babu : మంచు కుటుంబ వివాదంలో మరో ట్విస్ట్
మంచు మోహన్ బాబు కుటుంబ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
మంచు మోహన్ బాబు కుటుంబ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జల్ పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వాటిని తిరిగి తనకు స్వాధీనం చేసేలా చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు జిల్లా కలెక్టర్ ను కోరారు. మంచు మనోజ్ గత కొంతకాలంగా జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో ఉండటంతో ఆయన ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ కు ఫిర్యాదు...
దీంతో మోహన్ బాబుకు సంబంధించిన ఆస్తుల విషయమై వివరాలను సేకరించిన రెవెన్యూ అధికారులు మంచు మనోజ్ కు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. జల్ పల్లిలో ఇటీవల మోహన్ బాబుకు, మంచు మనోజ్ కు మధ్య విశేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఆ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా మోహన్ బాబు ఫిర్యాదుతో మరోసారి విభేదాలు వీధికెక్కినట్లయింది.