Pawan Kalyan : హుటాహుటిన హైదరాబాద్ కు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మంగళగిరిలో ఉన్న ఆయన హైదరాబాద్ కు వెళ్లిపోయారు. పవన్ కల్యాణ్ గత కొద్ది రోజుల నుంచి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఓజీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన వర్షంలో తడవటం కారణంగా వైరల్ ఫీవర్ వచ్చిందని భావిస్తున్నారు. ఇటీవల ఓజీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో నిర్వహించిన సభకు హాజరయ్యారు.
వైరల్ ఫీవర్ తో...
ఆరోజు వర్షంలోనూ ఫ్యాన్స్ తడుస్తుండటంతో తాను కూడా అభిమానులను కలిసేందుకు గొడుగు నుంచి బయటకు రావడంతో ఆయన కూడా ముద్దగా తడిసిపోయారు. దీంతో ఆయనకు వైరల్ ఫీవర్ సోకిందని చెబుతున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి మంగళగిరిలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్ ఫీవర్ తగ్గకపోవడంతో హైదరాబాద్ వెళ్లిపోయారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.