Chandrababu : నేడు హైదరాబాద్ లో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ రానున్నారు

Update: 2025-06-06 12:35 GMT

chandrababu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ రానున్నారు. సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకుంటారు. శని, ఆదివారాలు హైదరాబాద్ లోనే ఉంటారు. వివిధ ప్రయివేటు కార్యక్రమాలకు ఆయన హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. శని, ఆదివారాలు హైదరాబాద్ లో ఉండే చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్నానికి వెళతారు.

9 సాయంత్రానికి విశాఖకు...
ఈ నెల 9వ తేదీ సాయంత్రం విశాఖపట్నానికి చంద్రబాబు చేరుకుంటారు . ఈ నెల 10వ తేదీన విశాఖపట్నానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. గిరిజన యూనివర్సిటీలో జరిగే కన్వెన్షన్ లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానుండటంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకు వెళ్లనున్నారు.


Tags:    

Similar News