హైదరాబాద్ ఓ ఆర్‌ఆర్‌పై కార్ స్టంట్ల హంగామా
హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) పై తెల్లవారు జామున యువకులు లక్జరీ కార్లతో స్టంట్లు చేస్తూ హంగామా సృష్టించారు.
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) పై తెల్లవారు జామున యువకులు లక్జరీ కార్లతో స్టంట్లు చేస్తూ హంగామా సృష్టించారు. నిర్మానుషంగా ఉన్న ప్రదేశాల్లో అతి వేగంతో కార్లను నడుపుతూ, రిస్కీ స్టంట్లు ప్రదర్శించడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. రహదారిపై రేసింగ్, డిఫ్టింగ్ చేస్తూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇటీవల ఓఆర్‌ఆర్‌పై ఈ తరహా ప్రమాదకర డ్రైవింగ్ ఘటనలు పెరుగుతున్నాయి. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు నిఘా బిగించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రమాదకర డ్రైవింగ్ వల్ల తీవ్ర ప్రమాదాలు చోటుచేసుకోవచ్చని పోలీసులు హెచ్చరించారు.