గజం 3 లక్షలట.. హైదరాబాద్ లో నయా రికార్డు

హౌసింగ్‌ బోర్డు పరిధిలో కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్‌-7లో ఖాళీగా ఉన్న 18 స్థలాలకు కేపీహెచ్‌బీ ఫంక్షన్‌ హాల్‌లో వేలం నిర్వహించారు.

Update: 2025-06-12 07:16 GMT

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో గృహ నిర్మాణ మండలి పరిధిలో ఉన్న ఓపెన్‌ ప్లాట్ల వేలం రియలెస్టేట్ రంగాన్ని విస్తుపోయేలా చేసింది. ఒక కమర్షియల్‌ ప్లాట్‌ ధర గజం 2 లక్షల 98 వేల రూపాయలు పలకడం విశేషం. చదరపు గజం ధర ఇంత భారీగా పలకడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారని రాష్ట్ర గృహ నిర్మాణ మండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎండీ ఐఏఎస్‌ వి.పి.గౌతమ్‌ తెలిపారు.


హౌసింగ్‌ బోర్డు పరిధిలో కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్‌-7లో ఖాళీగా ఉన్న 18 స్థలాలకు కేపీహెచ్‌బీ ఫంక్షన్‌ హాల్‌లో వేలం నిర్వహించారు. వీటిలో నాలుగు నివాసస్థలాలు, 13 వాణిజ్య క్యాటగిరి, కైతలాపూర్‌లో ఉన్న బిట్టుతో కలిపి మొత్తం 18 స్థలాలు. వీటిలో 151 చదరపు గజాలు ఉన్న 22వ నంబరు ప్లాట్‌కు చదరపు గజానికి 2.98 లక్షల చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. మొత్తం 18 ప్లాట్లు కలిపి 6,236.33 చదరపు గజాలను వేలం వేయగా సగటున ఒక్కో గజానికి 2.38 లక్షల రూపాయల చొప్పున ధర పలికింది.

Tags:    

Similar News