Telangana : హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది అందుకే
భావి తరాల భవిష్యత్ కోసమే హిల్ట్ పాలసీని తీసుకువచ్చామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
భావి తరాల భవిష్యత్ కోసమే హిల్ట్ పాలసీని తీసుకువచ్చామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీలో హిల్ట్ పాలసీ పై చర్చ సందర్భంగా మంత్రి వివరించారు. హిల్ట్ పాలసీని తెచ్చింది హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడటం కోసమేనని శ్రీధర్ బాబు తెలిపారు. అయితే హిల్ట్ పాలసీపై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని, కానీ అందులో వాస్తవం లేదన్నారు. పరిశ్రమలను ఔటర్ రింగ్ ోడ్డు ఆవలివైపునకు తరలిస్తే పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం నుంచి హైదరాబాద్ బయటపడుతుందని అన్నారు.
కాలుష్యం లేకుండా...
ఓఆర్ఆర్ లోపల కాలుష్యం లేకుండా చేయడం కోసమే హిల్ట్ పాలసీని తీసుకు రావడం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాతనే హిల్ట్ పాలసీని తీసుకు వచ్చామని చెప్పారు. కొందరు పాలసీ గురించి తెలియకుండా చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పాలసీ అమలులో మంచి సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకుని వాటిని పరిశీలించి అమలు చేయడానికి సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో తెలిపారు. భవిష్యత్ తరాల గురించి ఆలోచించి హిల్ట్ పాలసీని తీసుకు వచ్చామని తెలిపారు.