సంక్రాంతి వెళ్లే వారికి సజ్జనార్ సూచనలివే
హైదరాబాద్ నగర వాసులకు పోలీసు కమిషనర్ సజ్జనార్ పలు సూచనలు చేశారు
హైదరాబాద్ నగర వాసులకు పోలీసు కమిషనర్ సజ్జనార్ పలు సూచనలు చేశారు. సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లే ముందు సమీప పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని అన్నారు. సంక్రాంతి పండగ సెలవులకు లక్షలాది మంది ప్రజలు తమ సొంతూళ్లకు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే దొంగల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. ఇళ్లకు వేసిన తాళాలను పగలకొట్టి ఉన్నదంతా దోచుకుపోతారు.
డయల్ 100 కి కాల్ చేయండి...
ఈ నేపథ్యంలోనే పోలీస్ కమిషనర్ సజ్జనార్ హైదరాబాద్ నగరవాసులకు సూచించారు. సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళితే సంబంధిత పోలీస్ స్టేషన్ లో గాని, లేదా బీట్ ఆఫీసర్ కు తెలియజేయాలని సజ్జనార్ కోరారు. అలాగే తమ వద్ద ఉన్న నగదు, బంగారం ఇంట్లో ఉంచొద్దని తెలిపారు. వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయవచ్చని సీపీ సజ్జనార్ కోరారు.