Road Accident : హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో మెడికో మృతి
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మెడికో మరణించారు
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మెడికో మరణించారు. ఎంబీబీఎస్ చదువుతున్న ఐశ్యర్య ఈ రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఆమె తండ్రి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారుు. హయత్ నగర్ పోలీసుల కథనం ప్రకారం ఆర్టీసీ కాలనీ వ ద్ద తన తండ్రి పాండుతో కలిసి ఐశ్వర్య రోడ్డు దాటుతుంది. ఈ సమయంలో ఒక కారు అతివేగంగా వచ్చి తండ్రీ కూతుళ్లను ఢీకొట్టింది.
గాయపడిన ఇద్దరినీ...
ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండటా ఐశ్వర్య మృతి చెందింది. తండ్రి పాండు మాత్రం తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం పాండును వేరే ఆసుపత్రికి తరలించారు. ఐశ్వర్య మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.