Revanth Reddy : నేడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రాత్రి ఏడు గంటల నుంచి 9 గంటల వరకూ ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రోడ్ షోలు, సభల ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. ఈరోజు రాత్రి ఏడు గంటలకు షేక్ పేట్ డివిజన్ లో ముఖ్యమంత్రి కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు.
కార్నర్ మీటింగ్ లలో...
అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు రహమత్ నగర్ లో జరిగే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో ఆయన బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలను చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో వేగం పెంచారు. ఓటర్లను చివరి నిమిషంలో తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేయనున్నారు