Telangana : స్పీకర్ ను కలిసిన కడియం శ్రీహరి

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావును స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు.

Update: 2025-11-21 07:19 GMT

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావును స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు. తనకు వివరణ ఇచ్చేందుకు కొంత సమయం కావాలని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగిస్తున్న స్పీకర్ ఇప్పటి వరకూ వివరణ ఇవ్వని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు నిన్న నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు.

వివరణ ఇచ్చేందుకు...
అయితే కడియం శ్రీహరిని ఈ నెల 23వ తేదీన తన ఎదుట హాజరు కావాలని స్పీకర్ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాదరావును కలిసిన కడియం శ్రీహరి తనకు వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో అందుకు స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అనర్హత వేటుపై స్పీకర్ నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News