Hyderabad : నేడు నవీన్ యాదవ్ నామినేషన్

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు

Update: 2025-10-17 04:40 GMT

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీతో వెళ్లి షేక్ పేట్ రిటర్నింగ్ అధికారి ఎదుట తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.

భారీ ర్యాలీతో వెళ్లి...
ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. యూసఫ్ గూడ నుంచి జూబ్లీహిల్స్ వరకూ భారీగా ర్యాలీతో వెళ్లి నవీన్ యాదవ్ తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది.


Tags:    

Similar News