ఫ్యాక్ట్ చెక్: మొత్తం బంగారుమయమైన రథం ఆంధ్రప్రదేశ్ ఒడ్డుకు కొట్టుకు వచ్చిందా..?

అసని తుఫాను ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే..! ఆ సమయంలో శ్రీకాకుళం వద్ద సముద్రంలో ఓ రథం లాంటి వస్తువు కొట్టుకుని వచ్చింది. స్థానికులు ఆ రథాన్ని పోలీసులకు అప్పజెప్పారు.

Update: 2022-05-14 08:34 GMT

క్లెయిమ్: బంగారుమయమైన రథం ఆంధ్రప్రదేశ్ ఒడ్డుకు కొట్టుకు వచ్చిందా..?

ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు

అసని తుఫాను ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే..! ఆ సమయంలో శ్రీకాకుళం వద్ద సముద్రంలో ఓ రథం లాంటి వస్తువు కొట్టుకుని వచ్చింది. స్థానికులు ఆ రథాన్ని పోలీసులకు అప్పజెప్పారు.

తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయనే వార్తల మధ్య, "బంగారు రథం" ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం తీరానికి చేరుకుందనే వాదనతో ఒక వీడియో వైరల్ అయ్యింది. వైరల్ వీడియోలో ప్రజలు సముద్రం నుండి ఒడ్డుకు రథాన్ని లాగుతుండడం మనం గమనించవచ్చు.

ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో చాలా మంది వ్యక్తులు వైరల్ వీడియోను షేర్ చేశారు. ఇది పూర్తిగా బంగారంతో చేసిన రథం అని చెప్పడం మొదలుపెట్టారు. "సముద్రంలో బంగారంతో చేసిన రథం కనుగొనబడింది. అసని తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో బంగారంతో చేసిన రథం తీరానికి చేరుకుంది. రథం థాయ్‌లాండ్ లేదా మయన్మార్ నుండి తేలుతూ ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరి ఉండవచ్చు." అని చెప్పడం మొదలుపెట్టారు.

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

మే 10న శ్రీకాకుళం బీచ్‌కు ఒక "బంగారు రంగు" రథం ఒడ్డుకు కొట్టుకువచ్చిందని పలు విశ్వసనీయ మీడియా సంస్థలు ఈ సంఘటనను నివేదించాయని మేము కనుగొన్నాము. తెలుగు పోస్ట్ కూడా అందుకు సంబంధించిన కథనాలను అందించింది.

బంగారు రంగు రథాన్ని స్థానికులు సముద్ర తీరానికి లాగుతున్నట్లు వీడియోలో కనిపించింది. అయితే రథం బంగారంతో చేసినట్టు ఎక్కడా నివేదించలేదు. ఏ అధికారి కూడా ధ్రువీకరించలేదు.

సంతబొమ్మాళి మండలం M.సున్నాపల్లి సముద్రతీరానికి బంగారు వర్ణంతో ఉన్న రథం కొట్టుకురావడంతో.. దీన్ని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. జనం ఎగబడుతుండటంతో దీనికి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ఇది మయన్మార్‌ నుంచి కొట్టుకువచ్చినట్టుగా నిర్థారణకు వచ్చారు.



మయన్మార్‌లో యువతీయువకులు బౌద్ధమతంలో చేరి సన్యాసం స్వీకరించే సమయంలో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. యువతీ యువకులను ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాల్లో ఊరేగిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సముద్రతీరానికి కొట్టుకువచ్చిన వాహనం కూడా ఇలాగే కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఊరేగింపు నిర్వహించిన తర్వాత ఈ వాహనాన్ని సముద్రంలో నిమజ్జనం చేసి ఉంటారు. ఈ వాహనంపై జనవరి 16 అనే తేదీ కూడా కనిపిస్తోందని అన్నారు.
ఈ బంగారు రథం రూపురేఖలు, డిజైన్లు అన్నీ కూడా బౌద్ధమతం ధీమ్ లోనే ఉన్నాయి. మూడు నెలల క్రితమే నెల్లూరు జిల్లా తీరప్రాంతానికి ఇలాంటి వాహనం ఒకటి కొట్టుకొచ్చింది. అది చాలా పాతగా కనిపించింది. ఆ వాహనంలో బుద్ధుని ప్రతిమ, చిత్రంతో, శివలింగం కూడా ఉన్నాయి. తాజాగా వచ్చిన రథంపై ఉన్న భాషను ఇంట‌ర్నెట్‌లో సెర్చ్ చేయ‌గా అది మయన్మార్‌ దేశానికి చెందిందని, ఇది బంగారు రథం కాదని తెలిపారు.

కొట్టుకొచ్చిన బంగారు రథం గురించి స్థానిక సీఐ చేసిన వ్యాఖ్యలను కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.

Full View

రథం బంగారంతో కాకుండా.. కేవలం బంగారు రంగులో ఉందని స్పష్టం చేశారు.. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారి శ్రీకేష్ బి లథాకర్. "రథం ఇప్పుడు స్థానిక పోలీసుల అదుపులో ఉంది" అని ఆయన చెప్పారు.

శ్రీకాకుళంలోని టెక్కలి సర్కిల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం వెంకట గణేష్ మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు దర్యాప్తు చేసిన తరువాత, "రథంలో బంగారం వంటి విలువైన లోహం కనుగొనబడలేదు. ఇది ఉక్కు, చెక్కతో తయారు చేయబడింది. కానీ దానికి బంగారు రంగు పూశారు" అని తెలిపారు.

కాబట్టి.. ఈ రథం పూర్తిగా బంగారంతో చేశారనే వదంతుల్లో ఎటువంటి నిజం లేదు.


క్లెయిమ్: శ్రీకాకుళం వద్ద సముద్రంలో కొట్టుకొచ్చిన రథం బంగారంతో చేసిందా..?
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం


Claim :  A chariot made of gold reached the shores of Srikakulam in Andhra Pradesh because of Cyclone Asani.
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News