ఫ్యాక్ట్ చెక్: అమెరికాలోని ప్రస్తుత పరిస్థితి అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు
US నుండి 112 మంది అక్రమ భారతీయ వలసదారులతో కూడిన మూడవ బ్యాచ్ ఫిబ్రవరి 16, 2025న అమృత్‌సర్ విమానాశ్రయంలో దిగింది. రెండవ
protestors
US నుండి 112 మంది అక్రమ భారతీయ వలసదారులతో కూడిన మూడవ బ్యాచ్ ఫిబ్రవరి 16, 2025న అమృత్‌సర్ విమానాశ్రయంలో దిగింది. రెండవ బ్యాచ్ లో 119 మంది భారతీయులు భారత్ కు వచ్చారు. అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణిచివేత ధోరణిలో భాగంగా అక్రమ వలసదారులందరినీ వారి స్వదేశాలకు తిరిగి పంపించే వరకూ ఈ బహిష్కరణ కొనసాగుతుంది.
యునైటెడ్ స్టేట్స్‌తో ఒప్పందం చేసుకున్న తరువాత పనామా సిటీలోని ఒక హోటల్‌లో దాదాపు 300 మంది వలసదారులను నిర్బంధించారు. భారతదేశం, ఇరాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనాతో సహా దాదాపు పది ఆసియా దేశాల నుండి వచ్చిన వలసదారులు అమెరికా నుండి బహిష్కరించారు. వారిని స్వదేశాలకు పంపిస్తూ ఉన్నారు అధికారులు. కొన్ని నివేదికల ప్రకారం, పనామాలోని హోటల్‌లో నిర్బంధించిన వారిలో దాదాపు 30 మంది భారతీయులు ఉన్నారు.పోలీసు సిబ్బంది కొంతమంది వ్యక్తులను హింసాత్మకంగా వెంబడించి, వారిని కాఫీ షాప్ ముందు పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో USAలో వర్క్ పర్మిట్ లేకుండా చట్టవిరుద్ధంగా పని చేస్తున్న వ్యక్తులను వెంబడిస్తున్న పరిస్థితి అంటూ చెబుతున్నారు. దీనితో తమకు కావలసిన వారు విదేశం లో ఎన్ని కష్టాలు పడవలసి వస్తొనదో అని చాలా మంది భారతీయులు భయపడుతున్నారు.
ఫ్యాక్ట్ చెక్:
మొదటగా, వీడియో లో కనపడుతున్న షాప్ పేరు '' ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసాము. అనే కీ వర్డ్ ల తో సెర్చ్ చేయగా ఈ షాప్ జర్మనీ లోని బర్లిన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. బర్లిన్ లో ఉన్న '' చిత్రం తో వీడియో లోని స్క్రీన్ షాట్ తో పోల్చి చూడగా, రెండు ఒకే ప్రదేశాన్ని చూపిస్తున్నట్టు తెలుసుకున్నాం. ఈ పోలిక ను మనం ఇక్కడ చూడొచ్చు.
మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేశాం. డిసెంబర్ 22, 2024న ఒక X వినియోగదారు షేర్ చేసిన వీడియో మాకు కనిపించింది. “చూడండి: బెర్లిన్‌లోని ఒక మాల్‌లో పాలస్తీనియన్ చాఫీ స్కార్ఫ్ ధరించినందుకు జర్మన్ పోలీసులు మహిళలను వేధించారు. జర్మన్ పోలీసు అధికారులు పాలస్తీనా చిహ్నం ఉన్న వ్యక్తిని పట్టుకుని లాగేశారు.” అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ వీడియో USAలో చట్టవిరుద్ధంగా పని చేస్తున్న వ్యక్తుల పరిస్థితిని చూపిస్తుందన్న వాదనలో ఎలాంటి నిజం లేదు.