ఫ్యాక్ట్ చెక్: కోడి నోట్లో నుండి మంట వస్తున్న ఘటనకు ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులకు ఎలాంటి సంబంధం లేదు
'ఏవియన్ ఇన్ఫ్లుఎంజా' దీన్ని సాధారణంగా "బర్డ్ ఫ్లూ' అని పిలుస్తారు. పక్షులు, ఆవులు, ఇతర జంతువులలో వ్యాపించే వైరల్
chicken emitting fire
'ఏవియన్ ఇంఫ్లుఎంజా' దీన్ని సాధారణంగా "బర్డ్ ఫ్లూ' అని పిలుస్తారు. పక్షులు, ఆవులు, ఇతర జంతువులలో వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. జనవరి 1, 2025 నుండి, భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. ఎన్నో చోట్ల వేలల్లో పౌల్ట్రీలలో పెంచుతున్న పక్షులను చంపారు. మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇక పౌల్ట్రీ రంగంలో బర్డ్ ఫ్లూ భయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కేసులు నమోదైన నాలుగు ప్రాంతాలను బయోసెక్యూరిటీ జోన్‌లుగా ప్రకటించి ఆంక్షలు విధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నగరంలోని నరసింహారావు పేట్‌లో బర్డ్ ఫ్లూ కేసును అధికారులు నిర్ధారించారు. అక్కడ భారీ సంఖ్యలో కోళ్ల మరణాలకు దారితీసింది. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా కూడా ప్రకటించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న అన్ని చికెన్ దుకాణాలను మూసివేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు గ్రామాల్లో ఏవియన్ ఫ్లూ (బర్డ్ ఫ్లూ) కేసులు నమోదు కావడంతో అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో జంతువుల కోసం కోడి గుడ్లను ఇవ్వడం నిలిపివేసింది. ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వ్యాప్తికి వ్యతిరేకంగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బర్డ్ ఫ్లూ భయం చికెన్ ప్రేమికులను భయాందోళనలకు గురి చేసింది. చికెన్ సురక్షితం కాదని చాలా మంది ఈ సమయాల్లో తినకూడదనే పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెక్:
భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో వణుకు పుట్టిస్తున్న బర్డ్ ఫ్లూ లక్షణాలను మనం అర్థం చేసుకుందాం. తల, మెడ చుట్టూ వాపు చూడవచ్చు. కాళ్లు ఊదా రంగు లోకి మారుతూ ఉంటాయి. ఆకుపచ్చ విరేచనాలు ఉంటాయి. ఆకస్మిక మరణాన్ని మనం చూడవచ్చు.