ఫ్యాక్ట్ చెక్: 1908లో మూసీ నది వరద నీటిలో చార్మినార్ మునిగిపోయినట్లు చూపిస్తున్న చిత్రం ఏఐ-జెనెరేటెడ్

సెప్టెంబర్ 28, 1908న, హైదరాబాద్‌లో మూసి నది ఉగ్రరూపం దాల్చింది. నగరంలోని ఎన్నో ప్రాంతాలను ముంచెత్తింది.

Update: 2025-06-11 09:24 GMT

Charminar submerged

సెప్టెంబర్ 28, 1908న, హైదరాబాద్‌లో మూసి నది ఉగ్రరూపం దాల్చింది. నగరంలోని ఎన్నో ప్రాంతాలను ముంచెత్తింది. 'గ్రేట్ ముసి ఫ్లడ్' అని పిలువబడే ఈ సంఘటన ఇప్పటికీ అందరికీ గుర్తుంది. స్థానికంగా తుగ్యాని సీతాంబర్ అని పిలువబడే వరద హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ఈ ప్రాంతంలోని మూడు వంతెనలు కొట్టుకుపోయాయి. దాదాపు 50000 మందిని బలిగొంది. 1908లో జరిగిన వినాశకరమైన వరదలు హైదరాబాద్‌లో అభివృద్ధికి సంబంధించి కొత్త శకానికి నాంది పలికాయి, భవిష్యత్తులో విపత్తుల ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రణాళికాబద్ధంగా, దశలవారీగా పట్టణాభివృద్ధి జరిగింది.

ఇంతలో, హైదరాబాద్ లోని చార్మినార్‌ను చూపిస్తున్న చిత్రం ఒకటి వైరల్ అవుతూ ఉంది. మూసీ నది వరద నీటితో ఆ ప్రాంతం నిండిపోయింది. వరద నీటిలో చాలా మంది ప్రజలు ఉన్నారు, కొందరు నీటిలో మునిగిపోతున్నారు, మరికొందరు ఈత కొడుతూ ఇబ్బంది పడుతున్నట్లు చూడొచ్చు. నీటి మట్టం ఎక్కువగా ఉంది. ఫ్రేమ్ ఎడమ వైపున కనిపించే చిన్న నిర్మాణాలు, గుడిసెలు కూడా మునిగిపోయి ఉన్నాయి.
1908 లో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తిన విపత్తు వరదలను చూపించే అరుదైన చారిత్రాత్మక చిత్రాన్ని ఇది చూపిస్తుందని పేర్కొంటూ ఈ చిత్రం ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. “#Devastating Musi River Floods 28 September 1908. A rare historical photograph showing the catastrophic floods that submerged parts of Hyderabad, claiming over 15,000 lives and reshaping the city’s future.” అనే క్యాప్షన్ తో ఫోటోను షేర్ చేస్తున్నారు. అరుదైన వరదలకు సంబంధించిన ఫోటో అని షేర్ చేస్తున్న నెటిజన్లు చెబుతున్నారు.

Full View

Full View

Full View
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. సర్క్యులేషన్‌లో ఉన్న చిత్రం AI-జనరేటెడ్ ఇమేజ్. 
Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి ఇమేజ్‌ని సెర్చ్ చేసినప్పుడు, చార్మినార్ వరద నీటిలో మునిగిపోయినట్లు చూపించే 3 వేర్వేరు చిత్రాలను షేర్ చేస్తున్న ఫేస్‌బుక్ పోస్ట్‌ను కనుగొన్నాము. “**Devastating Musi River Floods – 28 September 1908**” అనే టైటిల్ తో వీడియోను షేర్ చేశారు. 
ఈ చిత్రాలను AI-జనరేటెడ్ ఇమేజ్‌లుగా గుర్తించవచ్చు.
Full View
1908 మూసీ నది వరదల అసలు చిత్రాల కోసం మేము శోధించినప్పుడు, ఆ విధ్వంసం చిత్రాలను పంచుకున్న అనేక సోషల్ మీడియా పోస్ట్‌లను మేము కనుగొన్నాము, కానీ ఆ పోస్ట్‌లలో దేనిలోనూ వైరల్ చిత్రం మాకు కనిపించలేదు.

Full View


“Hyderabad flood 1908 stock photos and images.” అనే హెడ్ లైన్ తో అప్లోడ్ చేసిన అలమి స్టాక్ ఇమేజ్‌ అనేది వెబ్సైట్ లో కూడా వైరల్ ఇమేజ్‌ను పోలిన చిత్రం లేని గమనించాము. సర్క్యులేషన్‌లో ఉన్న చిత్రాన్ని గమనించిన తర్వాత, కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేసిన చిత్రాలపై Meta AI అంటూ ఉన్న వాటర్‌మార్క్‌ను మేము కనుగొన్నాము. Meta AI ఇమేజ్ జనరేటర్ ఉపయోగించి చిత్రం రూపొందించారని వాటర్‌మార్క్ సూచిస్తుంది.

AI ఇమేజ్ డిటెక్టర్‌లను ఉపయోగించి వైరల్ చిత్రాన్ని విశ్లేషించినప్పుడు, ఈ చిత్రం AI-జనరేటెడ్ చిత్రం అని మేము కనుగొన్నాము. AI ఇమేజ్ డిటెక్టర్ అయిన 'Was it AI' ఈ చిత్రం AI-జనరేటెడ్ చిత్రం అని నిర్ధారించింది. ఫలితాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్ ఇక్కడ ఉంది.

మరో AI డిటెక్టర్, Undetectable AI.com కూడా ఈ చిత్రం AI-జనరేటెడ్ ఇమేజ్ అని నిర్ధారించింది. అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్ ఇక్కడ ఉంది.


కనుక, హైదరాబాద్‌లోని ఐకానిక్ స్మారక చిహ్నం ‘చార్మినార్’ వరద నీటిలో మునిగిపోయిందని, ఇతర భవనాలు కూడా వరద నీటిలో మునిగిపోయాయని చూపిస్తున్న వైరల్ చిత్రం, AI సృష్టి. ఇది 1908లో సంభవించిన మూసీ వరదల అరుదైన ఫోటో అనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  1908లో హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన వరదల సమయంలో మునిగిపోయిన చార్మినార్‌ను వైరల్ చిత్రం చూపిస్తుంది.
Claimed By :  Facebook Users
Fact Check :  Unknown
Tags:    

Similar News