ఫ్యాక్ట్ చెక్: ఆ వైరల్ ఫోటోలో ఉన్న అమ్మాయి విరాట్ కోహ్లీ కుమార్తె కాదు
క్రికెట్ ప్రపంచ కప్ 2023లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. క్రికెట్ ప్రపంచ కప్ 2023లో 11 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 95.63 సగటుతో 765 పరుగులు చేశాడు. ఇక క్రికెటర్లలో గత 25 ఏళ్లలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తిగా కోహ్లీ నిలిచాడు.
Virat Kohli

విరాట్ కోహ్లీ పర్సనల్ లైఫ్ చూసుకుంటే.. బాలీవుడ్ నటి అనుష్క శర్మను విరాట్ కోహ్లీ 2017లో వివాహం చేసుకున్నాడు. జనవరి 2021లో ఆడ పిల్లకు తల్లిదండ్రులు అయ్యారు. వామిక అనే 2 ఏళ్ల కుమార్తె కోహ్లీకి ఉంది. ఇప్పుడు, విరాట్ కోహ్లి ఓ పిల్లాడితో ఉండగా.. ఆ ఫోటోలో ఉన్నది అతని కూతురే అనే వాదనతో వైరల్ అవుతోంది.
"విరాట్ కోహ్లీ తన కూతురితో" అనే క్యాప్షన్‌తో ఫోటో వైరల్ అవుతోంది.
"విరాట్ కోహ్లీ తన కూతురితో" అనే క్యాప్షన్‌తో ఫోటో వైరల్ అవుతోంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చిత్రంలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లి తన కూతురు వామికతో ఉన్నదన్నది నిజం కాదు. అందులో ఉన్నది విరాట్ కోహ్లీ బుల్లి అభిమాని.
విరాట్ కోహ్లి కుమార్తెకు సంబంధించిన ఫోటోల కోసం వెతికినప్పుడు.. ప్రధాన స్రవంతి మీడియాలోని నివేదికలలో ఆమెకు సంబంధించిన చిత్రాలు ఏవీ కనిపించలేదు.
Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసిన తర్వాత, ఈ వైరల్ చిత్రం సోషల్ మీడియా ఖాతాలలో ఆగస్టు 2023లో ప్రచురించారని మేము కనుగొన్నాము. ఇన్‌సైడ్ స్పోర్ట్ అనే న్యూస్, మీడియా వెబ్‌సైట్ అనే Facebook హ్యాండిల్, ఆ చిత్రాన్ని ఆగస్టు 24, 2023న 'Virat Kohli with a cute little fan' అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది.
‘Virat Kohli with a cute little fan – What a beautiful picture!’ అనే టైటిల్ తో ట్విట్టర్ లో కూడా ఇమేజ్ ను షేర్ చేశారు.
మేము విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల కుమార్తె చిత్రాల కోసం సెర్చ్ చేయగా.. మేము క్రికెట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ఉత్సాహపరుస్తున్న అనుష్క శర్మ, ఆమె చేతుల్లో కుమార్తె ఉన్న చిత్రాలను పోస్టు చేసిన 'ది స్టేట్స్‌మెన్' కథనాన్ని కనుగొన్నాము. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు తమ కుమార్తె ఫోటోల విషయంలో ఇప్పటికే పలుమార్లు మీడియాకు రిక్వెస్ట్ చేసుకున్నారు. తమ కుమార్తె ఫోటోలను అప్లోడ్ చేయకండని.. ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నామని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా గతంలో విరుష్క జంట పోస్టులు పెట్టింది.
కాబట్టి, వైరల్ ఫోటోలో విరాట్ కోహ్లీతో ఉన్నది అతని కుమార్తె కాదు. కోహ్లీకి ఉన్న అభిమాని. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
కాబట్టి, వైరల్ ఫోటోలో విరాట్ కోహ్లీతో ఉన్నది అతని కుమార్తె కాదు. కోహ్లీకి ఉన్న అభిమాని. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Image shows Virat Kohli with his daughter
Claimed By : Social media users
Fact Check : Unknown