ఫ్యాక్ట్ చెక్: రాహుల్ గాంధీ సొంత కుటుంబం అంటూ వైరల్ అవుతున్న చిత్రం ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని.. కేవలం ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని ప్రకటన వచ్చింది. వయనాడ్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు.

Update: 2024-05-02 12:00 GMT

Rahul Gandhi

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని.. కేవలం ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని ప్రకటన వచ్చింది. వయనాడ్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఉత్తర‌ప్రదేశ్‌లోని అమేథి లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తర‌ఫున ఎవ‌రు పోటీ చేస్తార‌నే దానిపై కూడా ఓ వైపు చర్చ జరుగుతూ ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, అమేథి నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ, వయనాడ్‌లో పీపీ సునీర్‌పై విజయం సాధించారు. అమేథిలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు.

ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక అమ్మాయి, ముగ్గురు పిల్లలతో ఉన్న ఫోటో వైరల్ అవుతూ ఉంది. అది రాహుల్ గాంధీ కుటుంబం అని.. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ రహస్యంగా దాచారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ, కొందరు పిల్లలు హెలికాప్టర్ ముందు పోజులు ఇస్తున్నారు.
“దాచేస్తే దాగుతాయా నిజాలు.? ఎప్పటికైనా విత్తనం భూమిని చీల్చుకుంటూ... బయటకు వచ్చినట్లు, అలా అలా బయటకు వచ్చేస్తాయి.!” అంటూ పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతూ ఉన్నారు.
Full View

Full View
“బహిరంగ భ్రహ్మచారి... ఇక మీ కామెంట్ నాకైతే తెలియదు..మీకు ఏమైనా ఎరుకనా...?? ఎరుక అయితే కాస్తా బంధం కోసం చెప్పారా..??!” మరికొందరు ప్రచారం చేస్తున్నారు.
హిందీలో అదే క్లెయిమ్‌తో జనవరి 2024లో కూడా ఈ పోస్టు వైరల్ అయింది.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చిత్రంలో కనిపిస్తున్న పిల్లలు రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులు కాదు.
Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి చిత్రాన్ని వెతకగా.. మేము అదే చిత్రాన్ని భాగస్వామ్యం చేసిన కొన్ని కథనాలను కనుగొన్నాము. ‘महिला कांग्रेस बारां जिलाध्यक्ष प्रियंका नंदवाना की पुत्री को राहुल गांधी ने करवाई हेलीकॉप्टर शेयर’, అనే టైటిల్ తో యూట్యూబ్ వీడియోలను పోస్టు చేశారు. వైరల్ పోస్టును అనువదించగా.. ‘రాహుల్ గాంధీ మహిళా కాంగ్రెస్ 2వ జిల్లా అధ్యక్షురాలు ప్రియాంక నంద్వానా కుమార్తెతో హెలికాప్టర్‌ దగ్గర ఫోటోలు దిగారు’ అని అర్థం వస్తుంది. ఈ వీడియోలో ఉన్నది రాజస్థాన్‌లోని బరన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ప్రియాంక నంద్వానా పిల్లలు అని మీడియా సంస్థలు తెలిపాయి. పెద్దమ్మాయి పుట్టిన రోజు కావడంతో వారిని రాహుల్ గాంధీ వారిని హెలికాప్టర్‌లో ఎక్కించుకున్నారు.
Full View
ఇలాంటి విజువల్స్ తో కూడిన వీడియోను కనక్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా షేర్ చేసింది, ‘కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన మాటను నిలబెట్టుకున్నారు, విద్యార్థిని హెలికాప్టర్ రైడ్‌లో తీసుకెళ్లాడు’ అనే శీర్షికతో వీడియోను షేర్ చేశారు.
Full View
మరింత సెర్చ్ చేయగా.. రాజస్థాన్ తక్ వార్తా వెబ్‌సైట్‌లో మాకు ఫోటో కథనం కనిపించింది. రాహుల్ గాంధీ తన తల్లి పుట్టినరోజును జరుపుకోవడానికి సవాయ్ మాధవపూర్‌కు వెళ్తున్నారని, అదే సమయంలో కామాక్షి నంద్వానా తన 14వ పుట్టినరోజును జరుపుకుంటూ ఉంది. రాహుల్‌ వారిని పిలిచి హెలికాప్టర్‌ లో ఎక్కించుకున్నారు.
అందువల్ల, రాజస్థాన్‌లోని బరన్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలి కుటుంబ సభ్యులతో రాహుల్ గాంధీ ఉన్న చిత్రం తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు. వైరల్ చిత్రంలో ఉన్నది రాహుల్ గాంధీ కుటుంబం కానేకాదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Claim :  రాహుల్ గాంధీ తన ముగ్గురు పిల్లలతో ఉన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ రహస్యంగా ఉంచారు
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News