ఫ్యాక్ట్ చెక్: సాధువు వేషంలో ఉన్న ఉగ్రవాది అయూబ్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారనే వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది
అయూబ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న మాట నిజమే. కానీ వైరల్ ఫోటో ఏఐ సృష్టి
మహా కుంభమేళాకు కోట్లలో ప్రజలు పోటెత్తుతున్నారు. పలువురు ప్రముఖులు కూడా కుంభమేళాలో స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, ఇతర క్యాబినెట్ మంత్రులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్ ప్రాంతంలోనే క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన ప్రతిపాదనలు, పథకాలను ఆమోదించారు.
ఓ సాధువును ఇద్దరు పోలీసులు నీళ్లలో పట్టుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అయూబ్ ఖాన్ అనే ఉగ్రవాదిని పట్టుకున్నారంటూ ఈ ఫోటోతో పోస్టులు పెట్టారు.
""అయూబ్ ఖాన్ " మహా కుంభ మేళాలో అనుమానస్పదంగా తిరుగుతుంటే ఒక సాధువుకి అనుమానం వచ్చి మీది ఏ అఖాడా, మీ సాంప్రదాయం ఏది అని, ఏదో మంత్రోచ్చారణ చెయ్యమంటే చెయ్యలేక తప్పించుకునే ప్రయత్నం చెస్తే సాదువులే బందించి పోలీస్ లకు పట్టి ఇచ్చారాట ఉగ్రవాదుల కదలికల పై నిఘా వేసిన ప్రత్యేక దళం వారు వాడిని తమ అదుపులోకి తీసుకున్నారట,. ఇలాటీ వార్తల పై చెక్యులర్ చెక్కా గాళ్ళు నోరేత్తరు,, ఒక్క ముస్లిం గురువు కానీ ముస్లిం రాజకీయ నాయకులు కానీ ఒక్క ఖండన చెయ్యరు ఇది మంచిది కాదు రా వెధవల్లారా అని చెప్పరు,.. " అంటూ పోస్టు పెట్టారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
వైరల్ పోస్టుల్లోని ఫోటోను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఏ మీడియా సంస్థ కూడా వైరల్ ఫోటోతో కథనాన్ని ప్రచురించలేదు. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మాత్రం వీడియోలను పోస్టు చేశారు. అందులో అనేక కంప్యూటర్ జెనరేటెడ్ ఫోటోలతో కథనం ఉంది.
వాటిని ఇక్కడ చూడొచ్చు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా కుంభమేళాలో అయూబ్ అలీ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కథనాలను కనుగొన్నాం.
"Yeti Narasimhanand: महाकुंभ में यति नरसिंहानंद के कैंप से पकड़ा गया संदिग्ध व्यक्ति, आयुष बनकर पहुंचा था अयूब" అనే టైటిల్ తో కథనాన్ని నవభారత్ టైమ్స్ లో ప్రచురించారు. అందుకు సంబంధించిన లింక్ ఇక్కడ చూడొచ్చు.
"Prayagraj Mahakumbh: Ayub Ali posing as Ayush caught near Yati Narsinghanand’s Camp; Probe underway" అనే టైటిల్ తో ఆర్గనైజర్ వెబ్సైట్ లో కూడా కథనాన్ని చూశాం. వైరల్ ఫోటోకు, వెబ్సైట్ లో ఉన్న ఫోటోకు ఎలాంటి సంబంధం లేదు.
జనవరి 14నే ఈ ఘటన చోటు చేసుకుందని ఆర్గనైజర్ వెబ్సైట్ కథనంలో ఉంది. ఘజియాబాద్‌లోని దాస్నా మందిర్ ప్రధాన పూజారి, జునా అఖారాకు చెందిన మహంత్ యతి నర్సింహానంద్ మహా కుంభ్ శిబిరం దగ్గర అయూబ్ అలీని అదుపులోకి తీసుకున్నారు. అయూబ్ "ఆయుష్" అనే పేరును ఉపయోగించి కుంభమేళాలో ప్రవేశించినట్లు నివేదించారు. నర్సింహానంద్ క్యాంపు దగ్గర సంచరించడానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఈ సంఘటన జనవరి 14 న జరిగింది. క్యాంపు దగ్గర అయూబ్ ప్రవర్తన అనుమానాలను రేకెత్తించింది. వారు అతనిని ప్రశ్నించారు. ఆ సమయంలో అయూబ్ తన పేరు ఆయుష్ అని చెప్పుకున్నాడు. నర్సింహానంద్‌ను కలవడానికి తాను అక్కడకు వచ్చానని చెప్పాడు. అయితే అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో అయూబ్ తన అసలు పేరు, గుర్తింపును బయటపెట్టాడు.
ఈ అరెస్టుకు సంబంధించిన పలు మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
వైరల్ ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారనే అనుమానంతో హైవ్ మోడరేషన్ వెబ్సైట్ లో ఈ ఫోటో వివరాలను తెలుసుకోడానికి ప్రయత్నించగా.. 98.7% ఏఐ సృష్టి అని తేలింది.
ఆయూబ్ ఖాన్ అనే వ్యక్తి అరెస్టు అయ్యాడు. అయితే అతడు తీవ్రవాది అంటూ అధికారులు ధ్రువీకరించలేదు.
అయూబ్ ఖాన్ అనే తీవ్రవాది అరెస్టు అయ్యాడనే వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ ఫోటో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.Claim : సాధువు వేషంలో ఉన్న అయూబ్ ఖాన్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Claimed By : Social Media Users
Fact Check : Unknown