నిజ నిర్ధారణ: అంబానీ కుటుంబంతో షారుఖ్ ఖాన్ తీసుకున్న సెల్ఫీ పఠాన్ విడుదలైన తర్వాత తీసుకున్నది కాదు

నిజ నిర్ధారణ: అంబానీ కుటుంబంతో షారుఖ్ ఖాన్ తీసుకున్న సెల్ఫీ పఠాన్ విడుదలైన తర్వాత తీసుకున్నది కాదు

Update: 2023-02-07 06:30 GMT

షారుఖ్ ఖాన్ చిత్రం పఠాన్ అనేక వివాదాల మధ్య జనవరి 25 న విడుదలైంది. #బాయ్కాట్పఠాన్ అనే హ్యాష్‌ట్యాగ్ అనేక కారణాల వల్ల సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. దీని తర్వాత, షారుక్ ఖాన్ అంబానీ కుటుంబంతో సెల్ఫీ దిగుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షారుఖ్ ఖాన్ అంబానీ కుటుంబంతో కలిసి పఠాన్ చిత్రాన్ని వీక్షించి, ఆపై ఒక సెల్ఫీని క్లిక్ దిగారంటూ ఈ చిత్రాన్ని వినియోగదారులు షేర్ చేస్తున్నారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ, అలాగే ఏఆర్ రెహమాన్ కూడా షారూఖ్ ఖాన్‌తో సెల్ఫీ దిగుతూ కనిపిస్తున్నారు.

చిత్రంపై క్యాప్షన్ హిందీలో “तुम लोग बायकॉट करते रहो थिएटर के बाहर वहाँ अंबानी परिवार शाहरुख़ के साथ पठान देख रहा है I” అని ఉంది. అనువదించబడినప్పుడు, “మీరు థియేటర్ వెలుపల సినిమా ను బహిష్కరిస్తూ ఉండండి. అక్కడ అంబానీ కుటుంబం షారుఖ్‌తో కలిసి పఠాన్‌ను చూస్తోంది”


నిజ నిర్ధారణ:

వైరల్ చిత్రం పఠాన్ సినిమా చూసిన తర్వాత అంబానీ కుటుంబం షారుఖ్‌తో సెల్ఫీ దిగుతున్నట్లు చూపుతోన్దన్న వాదన తప్పు. చిత్రం పాతది.

గూగుల్ ని ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ చిత్రం 2015 నాటిదని తెలుస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 28, 2015న ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించారు. నివేదిక ప్రకారం, రిలయన్స్ జియో 4ఘ్ సెప్టెంబర్ 28, 2015న ప్రారంభించబడింది. షారుఖ్ ఖాన్ అంబానీలతో కలిసి వేదికపై ఉన్నారు.

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లోని నివేదికలో ఈవెంట్ చిత్రాలను ప్రచురించారు, ఇందులో అంబానీ కుటుంబం షారుఖ్ ఖాన్,ఏ ఆర్ రెహమాన్‌లతో సెల్ఫీ తీసుకుంటున్న వైరల్ చిత్రం కూడా ఉంది.

ఈ చిత్రం రెడిఫ్.కాం లో ఏప్రిల్ 2016లో ప్రచురించబడిన ఋఎలీంచె ఝిఒ హై-స్పీడ్ కేబుల్ గురించిన కథనంలో కూడా ప్రచురితమయ్యింది.

2015లో ఇదే చిత్రాన్ని షేర్ చేస్తున్న కొన్ని ట్వీట్‌లను కూడా కనుగొన్నాము.

కాబట్టి, పంచుకున్న చిత్రం 2015 నాటిది, పఠాన్ చిత్రం విడుదలైన తర్వాత తీసినది కాదు. క్లెయిం అబద్దం.

Claim :  SRK and Ambani family took a selfie after watching the Pathan movie
Claimed By :  Twitter Users
Fact Check :  False
Tags:    

Similar News