ఫ్యాక్ట్ చెక్: కన్హయ్య లాల్ హంతకులను రాజసమంద్ ఎస్పీ బైక్ పై వెంబడించలేదు

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో దర్జీ కన్హయ్యలాల్‌ హత్య దేశ వ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. కన్హయ్యలాల్‌ హత్యను ఖండిస్తూ నిరసనలు కూడా చేపట్టారు. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి

Update: 2022-07-01 04:42 GMT

క్లెయిమ్: కన్హయ్య లాల్ హంతకులను రాజసమంద్ ఎస్పీ బైక్ పై వెంబడించారా..?

ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో దర్జీ కన్హయ్యలాల్‌ హత్య దేశ వ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. కన్హయ్యలాల్‌ హత్యను ఖండిస్తూ నిరసనలు కూడా చేపట్టారు. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. బీజేపీ నుండి సస్పెండైన నుపూర్‌ శర్మకు కన్హయ్య లాల్‌ సోషల్‌ మీడియా వేదికగా మద్దతు తెలిపినందుకు.. ఇద్దరు ముస్లిం వ్యక్తులు అతడ్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. రాజస్థాన్‌లో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కన్హయ్య లాల్ హత్యపై దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసును దర్యాప్తు చేయడానికి SOG ADG అశోక్ కుమార్ రాథోడ్, ATS IG ప్రఫుల్ల కుమార్, ఇద్దరు SPలతో SIT ఏర్పాటు చేసింది.


https://www.facebook.com/photo/?fbid=590547035767084&set=a.380496063438850

ఈ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో రాజ్‌సమంద్ ఎస్పీ సుధీర్ చౌదరిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

చాలా మంది ఎస్పీ సుధీర్ చౌదరి ఫోటోను షేర్ చేశారు. " రాజ్‌సమంద్ ఎస్పీ సుధీర్ చౌదరి కన్హయ్య లాల్‌ను హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంలో చాలా వేగంగా స్పందించారు. నగరం నుంచి తప్పించుకునేలోపే తానే స్వయంగా బైక్‌పై వెళ్లి ఇద్దరిని పట్టుకున్నాడు. ఈ సూపర్ కాప్ కు అభినందనలు! " అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

ఉదయపూర్‌కు 158 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్‌సమంద్ జిల్లాలోని భీమ్ అనే చిన్న పట్టణంలో వారిని అరెస్టు చేసినట్లు తేలింది. అరెస్టు సమయంలో భీమ్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలో రాజ్‌సమంద్ ఎస్పీ ఉన్నారు.


ఇద్దరు నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాల కోసం చూశాము. ఇండియా టుడే నివేదిక ప్రకారం, ఈ కేసులో ఇద్దరు నిందితులు గౌస్ మహ్మద్, రియాజ్ అహ్మద్ - రాజ్‌సమంద్ జిల్లా భీమ్ ప్రాంతంలో పట్టుబడ్డారు.

గూగుల్ మ్యాప్స్ ప్రకారం, భీమ్ జిల్లా ప్రధాన కార్యాలయానికి ఉత్తరాన 98 కి.మీ దూరంలో రాజ్‌సమంద్‌ కు ఉత్తరాన ఉదయపూర్‌కు 157 కి.మీ దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం.

హిందుస్థాన్ టైమ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో అరెస్ట్ వీడియోను మేము కనుగొన్నాము. ఈ వీడియోలో మూడు పోలీసు వాహనాలు, బైక్‌ను చూడగలిగాం. ఈ బైక్‌పై ఓ వ్యక్తి పోలీసు కార్ల వెంట వెళ్తూ కనిపించాడు.

అక్కడి పోలీసులను మీడియా బృందాలు సంప్రదించగా.. "ఎస్పీ ఆదేశాలను అనుసరించి, వ్యూహాత్మక ప్రదేశాలలో చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేసాము. వీరిద్దరిని పట్టుకోగలిగాము. జిల్లాకేంద్రం నుంచి మా ఎస్పీ పరిస్థితిని పర్యవేక్షించారు. బైక్ నడుపుతున్న వ్యక్తి పోలీసు ఇన్‌ఫార్మర్, "అని చెప్పుకొచ్చారు.


సుధీర్ చౌదరి ఈ ఘటనపై మాట్లాడుతూ.. అరెస్టు సమయంలో తాను భీమ్‌లో లేనని చెప్పారు. తమ బృందం అక్కడ ఉందని.. మొత్తం ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నానని చెప్పుకొచ్చారు.

వైరల్ పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.

క్లెయిమ్: కన్హయ్య లాల్ హంతకులను రాజసమంద్ ఎస్పీ బైక్ పై వెంబడించారా..?

క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు

ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం

Claim :  Rajsamand’s SP chase Kanhaiya Lal’s killers on a bike before arrest
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News