ఫ్యాక్ట్ చెక్: కుంభమేళాకు వెళ్లడాన్ని మానుకోవాలంటూ అధికారులు ప్రకటించలేదు. ఆడియోను ఎడిట్ చేశారు

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగియనుంది. జనవరి 13 వ తేదీన మహా కుంభమేళా ప్రారంభమయింది.

Update: 2025-02-26 07:39 GMT

announcement in maha kumbh

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగియనుంది. జనవరి 13 వ తేదీన మహా కుంభమేళా ప్రారంభమయింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అయితే ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి రావడంతో దేశం నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఇందుకోసం ప్రత్యేక ఘాట్లను ఏర్పాటు చేశారు. జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 64 కోట్ల మంది భక్తులు గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రాంతమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. జనవరి 13, 14, 29, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో ఇప్పటి వరకు మొత్తం ఐదు అమృత స్నానాలు జరిగాయి.

భక్తుల రద్దీతో ప్రయాగ్‌రాజ్ రోడ్లపై ట్రాఫిక్ జామ్ నెలకొంది. నగరంలోకి ప్రవేశించే చోట్ల బారికేడ్లు వేసినప్పటికీ రోడ్లపై వాహనాల రాకపోకలు సాగించడంతో భక్తులు కొన్ని కిలోమీటర్ల మేర నడిచి కుంభమేళాకు చేరుకున్నారు. వారణాసి, మీర్జాపూర్, జౌన్‌పూర్, కౌశాంబి, ప్రతాప్‌గఢ్, రేవా-చిత్రకూట్, కాన్పూర్, లక్నో మార్గాల్లో ప్రయాగ్‌రాజ్‌లోకి ప్రవేశించే వాహనాలు క్యూ భారీగా ఉంది.
మహా కుంభానికి వెళ్లే యాత్రను వాయిదా వేసుకుని ఇంటికి తిరిగి వెళ్లాలని భక్తులను కోరుకుతున్నట్లు ఆడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది. రైల్వే స్టేషన్‌లో భారీ జనసమూహం ఉన్న వీడియోను “व्यवस्था का आस्था से अनुरोध! सभी श्रद्धालुओं से अपील है कि प्रयागराज जाने का कार्यक्रम स्थगित कर दें!” హిందీ క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రైల్వే అధికారులు మహా కుంభ్‌లో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే వారి ప్రయాణాన్ని వాయిదా వేయమని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారని ఆ పోస్టులు పేర్కొన్నాయి. #mahakumbhstampede #mahakumbh2025 అనే హ్యాష్ ట్యాగ్స్ తో ఈ విజువల్స్ ను షేర్ చేస్తున్నారు.

క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు. 

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. వీడియోను ఎడిట్ చేశారు. తప్పుదారి పట్టించే విధంగా వీడియోకు ఆడియోను జోడించారు.
వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్‌లను ఉపయోగించి వెతికినప్పుడు, మేము అదే వీడియోను కనుగొనలేకపోయినప్పటికీ, న్యూస్ 18లో ప్రచురించిన ఇలాంటి విజువల్స్‌ను మాకు  లభించింది, అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు రైళ్లలోకి ఎక్కడం చూడవచ్చు.
Full View
पटना गया पैसेंजर में इस कदर भीड़ है। ट्रेन की संख्या अगर नहीं बढ़ा सकते हैं तब कम से कम बोगियों की संख्या ही बढ़ा दीजिए. @AshwiniVaishnaw जी. అంటూ ఎక్స్ లో ఇదే రకమైన వీడియోను పోస్టు చేశారు. “పట్నా గయా ప్యాసింజర్‌లో చాలా రద్దీ ఉంది. మీరు రైళ్ల సంఖ్యను పెంచలేకపోతే, కనీసం కోచ్‌ల సంఖ్యను పెంచండి." అని ఆ పోస్టుల్లో ఉంది. వైరల్ వీడియోలో అధికారులు ప్రయాణాలను మానుకోవాలన్న ప్రకటన ఏదీ చేయలేదు.
మరింత వెతికినప్పుడు, మేము జనవరి 29, 2025న ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచురించిన వీడియోను కనుగొన్నాము. మహా కుంభమేళాకి వెళ్లే వారు ప్రణాళికలను ఆపివేయమని రహదారిపై ఉన్న భక్తులకు ఒక వ్యక్తి విజ్ఞప్తి చేస్తున్నట్లు చూపుతోంది.
ఈ పోస్ట్‌లోని ఆడియో రైల్వే స్టేషన్‌లో భారీ జనసందోహాన్ని చూపుతున్న వీడియోకు జోడించారు. ఇటీవల రైల్వే అధికారులు ఈ ప్రకటన చేసినట్లుగా వైరల్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim :  ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ప్రణాళికను వాయిదా వేసుకోవాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News