ఫ్యాక్ట్ చెక్: కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ నేమ్ ప్లేట్ రాహుల్ రాజీవ్ ఫిరోజ్ అని లేదు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నిర్వహించిన “Learning to listen in the 21st Century” అనే సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు

Update: 2023-06-19 05:34 GMT

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నిర్వహించిన “Learning to listen in the 21st Century” అనే సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

‘రాహుల్ రాజీవ్ ఫిరోజ్’ అనే నేమ్‌ప్లేట్‌తో ఉన్న రాహుల్ గాంధీ చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీని సందర్శించి, ఒక కార్యక్రమంలో ప్రసంగించినప్పుడు ఆయన నేమ్‌ప్లేట్‌లో “రాహుల్ రాజీవ్ ఫిరోజ్" అని ఉందని సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.

“వీడీ నిజ స్వరూపం...ఫిరోజ్ ఖాన్ పుత్ర రత్నం. కేంబ్రిడ్జి యూనివర్సిటీ వారు క్లారిటీగానే ఉన్నారు, మనమే పంటిత్ అని గాంధీ అని జోకుతున్నాం” అంటూ రాహుల్ గాంధీని విమర్శిస్తూ పోస్టు పెట్టారు.

Full View


Full View

https://www.facebook.com/permalink.php?story_fbid=121268310983311

"ఇది వీడి నిజ స్వరూపం...ఫిరోజ్ ఖాన్ పుత్ర రత్నం. క్రేంబ్రిడ్జి యూనివర్సిటి వారు స్వష్టంగా ఉన్నారు. మన దేశపు అజ్ఞానపు మూర్ఖులు గాంధీ అని, హిందువు - పండిట్ అని భ్రమలో ఉన్నారు." అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.

https://www.facebook.com/permalink.php?story_fbid=566315079017353

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ ఫోటోను మార్ఫింగ్ చేశారని కనుగొన్నాం.

మేము వైరల్ ఇమేజ్‌ కు సంబంధించి Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. వైరల్ పోస్టుల్లో ఉన్న ఫోటోని ప్రచురించిన కొన్ని వార్తా కథనాలను మేము కనుగొన్నాము. మార్చి 2023లో “Learning to listen in the 21st Century” అనే అంశంపై రాహుల్ గాంధీ చేసిన ఉపన్యాసం గురించి ప్రస్తావిస్తూ
ABP Live.com
లో ప్రచురించిన నివేదికను చూశాం. అచ్చం వైరల్ వైరల్ ఇమేజ్‌ను కూడా చూశాం. కానీ నేమ్‌ప్లేట్‌పై ఏమీ రాయలేదని గుర్తించాం.

ట్విట్టర్ యూజర్ శామ్ పిటోడా కూడా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఎక్కడా కూడా రాహుల్ గాంధీ పేరుకు.. వైరల్ ఇమేజీకి పోలిక లేదు. “Some pictures from @RahulGandhi’s great lecture at @CambridgeMBA during his visit to a fellow of @CambridgeJBS Cambridge University on “Learning to Listen in the 21st Century.” #BharatJodoYatra #RahulGandhiinCambridge” అంటూ పోస్టు పెట్టారు.


ఈ చిత్రాన్ని న్యూస్ 18, ఈటీవీ భారత్‌ వంటి సంస్థలు కూడా నివేదించాయి. రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీని సందర్శించిన నివేదికలలో ఈ వైరల్ ఫోటోలు ఉన్నాయి.

కాబట్టి, వైరల్ అవుతున్న చిత్రం మార్ఫింగ్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. నేమ్‌ప్లేట్‌పై కనిపించిన పేరును ఎక్కడా ఉపయోగించలేదు. వార్తా నివేదికలలో అసలు చిత్రాన్ని చూశాం.. అందులో ఈ వైరల్ ఫోటోలు లేవు. కేంబ్రిడ్జ్ రాహుల్ గాంధీ పేరును ‘రాహుల్ రాజీవ్ ఫిరోజ్' అని చెప్పలేదు. వైరల్ అవుతున్న వాదనల్లో ఎటువంటి నిజం లేదు.

Claim :  Rahul Gandhi was called Rahul Rajiv Feroz at Cambridge
Claimed By :  Facebook Users
Fact Check :  False
Tags:    

Similar News