ఫ్యాక్ట్ చెక్: G7 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాన మంత్రి కి వేదికపై స్థానం కల్పించలేదు అనేది అబద్దం

కెనడాలోని కననస్కిస్‌లో ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో 51వ G7 శిఖరాగ్ర సమావేశం జరిగింది. నాయకులు ప్రపంచ

Update: 2025-06-19 14:54 GMT

G7 leaders

కెనడాలోని కననస్కిస్‌లో ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో 51వ G7 శిఖరాగ్ర సమావేశం జరిగింది. నాయకులు ప్రపంచ శాంతి, భద్రత నుండి ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, వృద్ధి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వరకు వివిధ అంశాలపై చర్చించారు. కననస్కిస్‌లో నిర్వహించిన G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 16, 2025న కెనడాకు చేరుకున్నారు. దశాబ్దం తర్వాత ఆయన తొలిసారి కెనడాకు వెళ్లారు. ఇంధన భద్రత, సాంకేతికత, ఆవిష్కరణలతో సహా కీలకమైన ప్రపంచ సమస్యలపై నాయకులు దృష్టి సారించారు.

G7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇంధన భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సౌర కూటమి (ISA), విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (CDRI), గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమి వంటి అంశాలపై భారతదేశం చొరవలను హైలైట్ చేశారు. ఉగ్రవాదంపై భారతదేశం బలమైన వైఖరిని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన ఆయన, ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేసే లేదా ప్రోత్సహించే వారిపై ప్రపంచం సమిష్టి చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.
కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యుఎస్ దేశాల ప్రపంచ నాయకులను చూపించే చిత్రం ఒకటి షేర్ అవుతూ ఉంది. కెనడాలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోడీకి వేదికపై స్థానం కల్పించలేదనే వాదనతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “Another Day, Another Diplomatic Blow. India's Prime Minister Modi is not given a place on the stage during the G7 summit in Canada.” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి సముచిత స్థానం దక్కలేదని యూజర్లు చెబుతున్నారు.

Stage is Clear and Visible. Modi, the #Embarrassment, was Not Invited to the G7 Summit — it was only Canada, France, Germany, Italy, Japan, the UK, and the US. India's reputation has #declined internationally. #BJPLiedToIndians” అంటూ కూడా మరికొన్ని పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ చిత్రంలో G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న సభ్య దేశాల నాయకులు ఉన్నారు.
G7 (గ్రూప్ ఆఫ్ సెవెన్) సభ్య దేశాలైన యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్‌లకు ఒక వేదికగా ఉంది. ఈ బృందం ప్రపంచ ఆర్థిక పాలన, అంతర్జాతీయ భద్రత మొదలైన అంశాలను చర్చించడానికి ఏటా సమావేశమవుతుంది. వైరల్ అవుతున్న చిత్రాన్ని తీసుకుని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ నిర్వహించాం. ఆ చిత్రం G7 2025 సమ్మిట్ అధికారిక వెబ్‌సైట్‌లో షేర్ చేశారని మేము కనుగొన్నాము. ఈ వైరల్ చిత్రం జూన్ 17, 2025న
G7 నాయకుల ఫ్యామిలీ
ఫోటో కింద ప్రచురించారు.
మరింతగా తనిఖీ చేసినప్పుడు, జూన్ 18, 2025న “ఔట్రీచ్ భాగస్వాములతో కుటుంబ ఫోటో” ( Family photo with outreach partners) అనే శీర్షిక కింద షేర్ చేసిన మరిన్ని ఫోటోలను మేము కనుగొన్నాము, భారత ప్రధానమంత్రితో పాటు అనేక మంది ప్రపంచ నాయకులను ఈ ఫోటో చూపిస్తుంది.
G7 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధానమంత్రి వర్కింగ్ లంచ్‌లో పాల్గొన్న ఇతర ఫోటోలు కూడా లభించాయి. 
సీనియర్ జర్నలిస్ట్ సిద్ధాంత్ సిబల్ X లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. G7లో 2 ఫార్మాట్‌లు ఉన్నాయని తెలిపారు. మొదటి రోజు సభ్య దేశాల నాయకులు ఫోటో కోసం సమావేశమయ్యారు. రెండవ రోజు ఫోటోలో సభ్య దేశాల నాయకులు ఆహ్వానించిన నాయకులతో కలిసి ఉన్నారు.
“Together for global progress! Productive exchanges with G7 leaders on key global challenges and shared aspirations for a better planet. @G7” అనే క్యాప్షన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ లో పోస్టు పెట్టారు.
కెనడాలో నిర్వహించిన G7 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాన మంత్రి మోదీకి వేదికపై స్థానం కల్పించలేదనే వాదన నిజం కాదు.
Claim :  కెనడాలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వేదికపై స్థానం కల్పించలేదు
Claimed By :  X (Twitter) users
Fact Check :  Unknown
Tags:    

Similar News