కొంతమంది యువత డ్రగ్స్ లేదా మత్తుపదార్థాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు తల్లిదండ్రులకు, సమాజానికి కూడా ఆందోళన కలిగిస్తోంది. మాదకద్రవ్యాల దుర్వినియోగం కారణంగా ఉత్పన్నమయ్యే ప్రభావాలు డిప్రెషన్, ఆందోళన, సైకోసిస్‌లకు కారణమవుతుంది. అంతేకాకుండా పిల్లలలో అనేక రకాల మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఆదాయాల పెరుగుదల, ఉద్యోగాల్లో తలమునకలై ఉండే తల్లిదండ్రులు, ఒత్తిడి, సులువుగా డ్రగ్స్ దొరుకుతూ ఉన్న కారణంగా దేశంలో కొన్ని ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాలలో 10 నుండి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలలో మాదకద్రవ్యాల దుర్వినియోగం పెరుగుదల కనిపిస్తూ ఉంది.
మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి, తెలంగాణలోని 20 వేలకు పైగా ఉన్నత పాఠశాలలు ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేయగా, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో 4000 కంటే ఎక్కువ డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేశారు. యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వ విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ప్రహరీ క్లబ్‌లలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక పోలీసు ప్రతినిధులు వంటి సభ్యులు ఉంటారు. ఈ క్లబ్‌లు పాఠశాలలు, కళాశాలల చుట్టూ డ్రగ్స్ లేని ప్రాంతాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
పాఠశాలల్లో కొత్త డ్రగ్ కనిపిస్తోంది అంటూ ఓ ప్యాకెట్‌లో పింక్ రంగు టెడ్డీ బేర్‌లను చూపుతున్న పోస్ట్ వైరల్ అవుతూ ఉంది. ఇది 'స్ట్రాబెర్రీ క్విక్' అని పిలువబడే కొత్త డ్రగ్ అని పోస్ట్ పేర్కొంది. "మనమందరం తెలుసుకోవలసిన చాలా భయానక విషయం ప్రస్తుతం పాఠశాలల్లో జరుగుతోంది. స్ట్రాబెర్రీ పాప్ రాక్‌ల లాగా కనిపించే ఒక రకమైన క్రిస్టల్ మెత్ ఇదని అందులో తెలిపారు. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తో ఈ డ్రగ్ ఉంటుంది. దీనిని పాఠశాల దగ్గర పిల్లలకు అందజేస్తున్నారు. దీనిని స్ట్రాబెర్రీ మెత్ లేదా స్ట్రాబెర్రీ క్విక్ అని పిలుస్తున్నారు. పిల్లలు దీన్ని మిఠాయి అని భావించి తీసుకున్నాక ఊహించని స్థితిలో ఆసుపత్రికి చేరుకుంటూ ఉన్నారు. వివిధ రూపాల్లో కూడా ఈ డ్రగ్ ప్రజల దగ్గరకు వస్తుంది. దయచేసి అపరిచితుల నుండి ఈ మిఠాయిని స్వీకరించవద్దని, ఇలాంటివి ఎవరి దగ్గరైనా ఉంటే ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ కు విషయాన్ని తీసుకెళ్లమని తెలపండి. దీన్ని మీకు వీలైనంత ఎక్కువ మందికి పంపండి" అంటూ పోస్టును వైరల్ చేస్తున్నారు.
ఇదే వాదన జింబాబ్వే, జమైకా మొదలైన ఆఫ్రికన్ దేశాలలో కూడా వైరల్ అవుతోంది
వాట్సాప్ లో కూడా ఈ పోస్టు వైరల్ అవుతోంది.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు.
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి చిత్రాన్ని వెతకగా, అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు ఈ వైరల్ పోస్టులను ఖండించారు. పాఠశాల పిల్లలకు స్ట్రాబెర్రీ-ఫ్లేవర్ "మెత్ మిఠాయి" వ్యాప్తి గురించిన పుకార్లను కొట్టిపారేశారు. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని సూచిస్తూ ""వ్స్qఊరెనెవ్స్ షేర్ చేసిన ఇన్స్టాగ్రాం పోస్ట్ మాకు లభించింది. దీనికి సంబంధించి సోషల్ మీడియా పోస్ట్ ఇక్కడ చూడొచ్చు.
"స్ట్రాబెర్రీ మెత్" లేదా "స్ట్రాబెర్రీ క్విక్" అనే డ్రగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందని, క్యాండీల రూపంలో పాఠశాల పిల్లలకు పంపిణీ చేస్తున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ స్పష్టం చేస్తూ
"The Print" లో ప్రచురించిన ఒక కథనం లభించింది. వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ఇది ఎన్నో ఏళ్లుగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న బూటక వార్త. 2007లో యునైటెడ్ స్టేట్స్‌లో మొదటిసారిగా ప్రజల్లోకి వచ్చినట్లు అందులో తెలిపారు.
US Drug Enforcement Administration (DEA)తో సహా పలు ఏజెన్సీలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి వదంతులను ప్రసారం చేశారు. ఎటువంటి విశ్వసనీయమైన ఆధారాలు కూడా ఈ వదంతులకు మద్దతు ఇవ్వలేదని అన్నారు. తల్లిదండ్రులు, ప్రజలు సాధారణంగా అప్రమత్తంగా ఉండాలని, అయితే షేర్ చేయడానికి ముందు ధృవీకరించని సందేశాలను వ్యాప్తి చేయవద్దని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను పాఠశాల అధికారులకు లేదా చట్టాన్ని అమలు చేసే సంస్థలకు నివేదించాలని శ్ఫ్ సూచించారు.
జమైకన్ విద్య, నైపుణ్యాలు, యువత, సమాచార మంత్రిత్వ శాఖ, జమైకన్ పాఠశాలల్లో స్ట్రాబెర్రీ క్విక్ డ్రగ్స్‌కు సంబంధించిన ఎలాంటి సంఘటనలను గుర్తించలేదని పేర్కొన్నట్లు మేము కనుగొన్నాము.
ఈ కథనం నుండి క్యూ గా తీసుకొని, మేము స్ట్రాబెర్రీ క్విక్ గురించి మరింత శోధించినప్పుడు,
Snopes.com ప్రచురించిన ఫ్యాక్ట్ చెక్ ని కనుగొన్నాము. ఈ కథనం ప్రకారం, 2007 ప్రారంభంలో, స్ట్రాబెర్రీ క్విక్ అని పిలవబడే మెథాంఫేటమిన్ అనే తీపి రుచి ఉండే క్యాండీలకు సంబంధించిన కథనాలు వ్యాపించాయి. స్ట్రాబెర్రీ క్విక్ గురించిన వివిధ వార్తా కథనాలు మొదట జనవరి 2007లో పశ్చిమ రాష్ట్రాల్లో కనిపించాయి. ఇవి పిల్లలు, యుక్తవయస్కులను ప్రభావితం చేస్తున్నాయనే భయాలను ప్రేరేపించింది. అయితే ఆ తర్వాత ఈ పుకార్లు నిరాధారమైనవని ఫెడరల్ డ్రగ్ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
మేము హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కూడా ఈ విషయమై సంప్రదించాము. వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నాము, అది లభించగానే ఈ ఆర్టికల్ ను అప్డేట్ చేస్తాము.
అందువల్ల పాఠశాలల్లో కొత్త డ్రగ్స్ చెలామణిలో ఉందన్న వాదన బూటకం. ఎన్నో ఏళ్లుగా వైరల్ పోస్టు సోషల్ మీడియాలో ఉంది. ఈ వాదనను పలువురు పోలీసు అధికారులు కూడా తోసిపుచ్చారు. కనుక, భయపడాల్సిన అవసరం లేదు.