అంధ్ర ప్రదేశ్ 2021 లో జరిగిన రెస్క్యూ ఆపరేషన్ వీడియోను తెలంగాణకి సంబంధించినదిగా షేర్ చేసిన జాతీయ మీడియా

భద్రాచలం వద్ద గోదావరి ఇప్పటికీ ప్రమాద స్థాయిలో ప్రవ్హిస్తోంది, చుట్టుపక్కల అనేక గ్రామాలు ఇప్పటికీ వరదముంపు ప్రమదాంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవల గోదావరి నదికి వచ్చిన వరదలలో, తెలంగాణలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడేందుకు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ అంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది.

Update: 2022-07-18 15:01 GMT

భద్రాచలం వద్ద గోదావరి ఇప్పటికీ ప్రమాద స్థాయిలో ప్రవ్హిస్తోంది, చుట్టుపక్కల అనేక గ్రామాలు ఇప్పటికీ వరదముంపు ప్రమదాంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవల గోదావరి నదికి వచ్చిన వరదలలో, తెలంగాణలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడేందుకు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ అంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియో ని కొన్ని ముఖ్యమైన జతీయ మీడియా మాధ్యమాలు కూడా పంచుకున్నాయి. జులై 2022 వరదల సమయంలో గోదావరి నదిలో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగినట్టు ఈ క్లెయిం లలో పేర్కొన్నారు.

Full View



నిజ నిర్ధారణ:

ఈ క్లెయిం తప్పు.

వీడియో నుండి సంగ్రహించబడిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వెతికినప్పుడు, ఈ వీడియో 2021 లో తీసినదిగా తెలుస్తోంది. ఇది ఇటీవలిది కాదు, నవంబర్ 2021 నాటిది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో జరిగింది కానీ తెలంగాణకు చెందినది కాదు.

నవంబర్ 19, 2021న ప్రచురించబడిన ఆభ్ఫ్ నివేదిక ఇక్కడ చూడొచ్చు.

https://news.abplive.com/videos/news/anantapur-air-force-s-rescue-operation-amaid-heavy-floods-andhra-pradesh-1494493

నవంబర్ 2021లో ప్రచురించబడిన 'ఆంధ్ర వర్షం తర్వాత నాటకీయ రెస్క్యూలో ఛాపర్, జిప్‌లైన్‌లు మరియు JCB' శీర్షికతో NDTV నివేదిక కూడా కనుగొన్నాం

https://www.ndtv.com/india-news/andhra-pradesh-rain-andhra-pradesh-floods-andhra-pradesh-weather-watch-chopper-ziplines-and-jcb-in-dramatic-rescue-after-andhra-rain-2618120

ణ్డ్ట్వ్ నివేదిక ప్రకారం, "రెస్క్యూ ఆపరేషన్ నాటకీయ వీడియో, ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం తర్వాత నది జలాలు ప్రమాదకరంగా మారినప్పుడు ప్రజలు JCB ఎర్త్‌మూవర్‌లో చిక్కుకుని ఉండడం చూపిస్తుంది."

ఈ నివేదికల నుండి క్యూ తీసుకొని, మేము "అనంతపూర్‌లో హెలికాప్టర్ రెస్క్యూ" అనే కీవర్డ్‌లను ఉపయోగించి శోధించగా, 2021లో ప్రచురించబడిన అదే సంఘటనకు సంబంధించిన అనేక స్థానిక మరియు జాతీయ వీడియోలు లభించాయి.

Full View

Full View

'ది హిందూ'లో ప్రచురించబడిన నివేదిక, ఇతర నివేదికల ప్రకారం, బెంగళూరులోని యలహంక నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్, అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామం వద్ద చిత్రావతి నది మధ్యలో చిక్కుకుపోయిన 10 మందిని రక్షించింది.

1.40 గంటలకు హెలికాప్టర్ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఎర్త్‌మోవర్‌లో చిక్కుకుపోయిన మొత్తం 10 మంది వ్యక్తులను రక్షించడానికి సుమారు గంట సమయం పట్టింది, వరద నీటి ప్రవాహం నానాటికీ పెరుగుతున్న కారణంగా ఈ ఆపరేషన్ కష్టం అయ్యింది.

ఈఆFలోని ఏడుగురు సిబ్బంది 10 మందిని రక్షించడానికి తీవ్రంగా శ్రమించగా, వారి కుటుంబాలు ఒడ్డున ఆత్రుతగా ఎదురు చూసారు.

https://www.thehindu.com/news/national/andhra-pradesh/iaf-chopper-rescues-10-persons-from-chitravathi/article37586964.ece

https://english.sakshi.com/news/tirupati/ap-govts-swift-response-helps-save-10-lives-video-viral-146839

ఈ రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన చిత్రాలను ఈఆF ట్విట్టర్ హ్యాండిల్ "ఈ రోజు, @@IAF_MCC MI-17 హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చిత్రావతి నది నీటి ఉధృతిలో చిక్కుకున్న పది మందిని క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించింది." అంటూ పంచుకుంది.

అందుకే, ఈ క్లెయిం అబద్దం. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం లో జరిగిన రెస్క్యూ ఆపరేషన్ వీడియో ను ఇటీవలదిగా పంచుకుంటున్నారు.

Claim :  Indian Air Force helicopter is going viral as an operation that took place in Telangana during the recent floods of Godavari River.
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News