ఫ్యాక్ట్ చెక్: బంగ్లాదేశ్ మీద దాడి చేయలేకపోతే రాజీనామా చేయాలని ప్రధాని మోదీకి యోగి ఆదిత్యనాథ్ సూచించలేదు

బంగ్లాదేశ్ మీద దాడి చేసి హిందువులను కాపాడాలని యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోదీ

Update: 2025-12-29 05:00 GMT

దైవదూషణ ఆరోపణలపై హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను దారుణంగా హత్య చేసిన ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వంపై నిరసనలు కొనసాగుతున్నాయి.


పొరుగు దేశంలో మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులపై భారతదేశం ఆందోళనలను వ్యక్తం చేసింది. అయితే దీన్ని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. న్యూఢిల్లీ నుండి వచ్చిన ప్రకటనలు వాస్తవాలను ప్రతిబింబించడం లేదని తెలిపింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీ సభ్యులపై హింస జరిగినట్లు వచ్చిన నివేదికల తర్వాత భారతదేశం ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం నుండి ఈ ప్రతిస్పందన వచ్చింది. "బంగ్లాదేశ్‌లోని మైనారిటీ వర్గాల పరిస్థితికి సంబంధించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మా దృష్టికి వచ్చాయి. ఆయన వ్యాఖ్యలు వాస్తవాలను ప్రతిబింబించడం లేదు. బంగ్లాదేశ్ దీర్ఘకాల మత సామరస్యం సంప్రదాయాన్ని తప్పుగా సూచించే ఏవైనా సరికాని, ప్రేరేపిత కథనాలను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది" అని బంగ్లాదేశ్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బంగ్లాదేశ్ పై దాడి చేయాలంటూ చెబుతున్నట్లు అనిపించే వీడియో ఇటీవల ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోలో, ఆదిత్యనాథ్ ఈ సంఘటనకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లుగా ఉంది. భారతదేశం బంగ్లాదేశ్‌పై చర్యలు తీసుకోలేకపోతే, ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ గురించి, మునీర్ పాకిస్తాన్‌లో ఉన్నంత కాలం భారతదేశం ఇబ్బందులను ఎదుర్కొంటుందని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది. ఆ వాదనలు
ఇక్కడ
, ఇక్కడ చూడొచ్చు. 


వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు


వైరల్ అవుతున్న వాదనకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారా అని తెలుసుకోవడం కోసం మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మాకు అందుకు సంబంధించి ఎలాంటి కథనాలు లభించలేదు.

వైరల్ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను తీసుకుని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. డిసెంబర్ 24, 2025న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారిక X ఖాతా ద్వారా షేర్ చేసిన వీడియో మాకు లభించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య గురించి మాట్లాడుతున్నట్లు వీడియోలో ఉంది. ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి మోడీని బంగ్లాదేశ్‌పై దాడి చేయమని లేదా పదవికి రాజీనామా చేయమని కోరారా అని తెలుసుకోడానికి ప్రయత్నించగా, ఎక్కడా కూడా అలాంటి ప్రస్తావన చేయలేదు.

అసలు వీడియోలో ఆదిత్యనాథ్ ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడ్డారు. "మీరు దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారు, అందుకే మీరు మౌనంగా ఉన్నారు. బంగ్లాదేశ్‌లో ఏమి జరిగిందో చూడండి - ఒక దళిత యువకుడిని ఎలా దారుణంగా నిప్పంటించారో. మీరు గాజా కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు, కానీ బంగ్లాదేశ్‌లో ఒక దళిత యువకుడిని చంపినప్పుడు మీ నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. మీరు గాజా సమస్యపై కొవ్వొత్తి ర్యాలీలను నిర్వహిస్తారు, కానీ పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్‌లో ఒక హిందువు చనిపోయినట్లు మౌనంగా ఉంటారు." అని విమర్శించారు యోగి ఆదిత్యనాథ్.




ప్రసంగంలో ఎక్కడా ఆయన ప్రధాన మంత్రి మోదీని బంగ్లాదేశ్‌పై దాడి చేయాలని లేదా రాజీనామా చేయాలని కోరలేదు.

మేము యూపీ అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ స్పీచ్ ను సంబంధించిన సుదీర్ఘ వీడియోను మేము గుర్తించాం. అందులో కూడా ఎక్కడా మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు.

Full View




ఇక వైరల్ అవుతున్న వాదనను ఖండిస్తూ కొన్ని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, చూడొచ్చు.


కాబట్టి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సంబంధించి డిజిటల్‌గా ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.


Claim :  బంగ్లాదేశ్ మీద దాడి చేసి హిందువులను కాపాడాలని యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోదీ
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News