ఫ్యాక్ట్ చెక్: పడవ తిరగబడిన వీడియో భారతదేశానికి సంబంధించిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

ఈ వీడియోకు భారతదేశానికి ఎలాంటి

Update: 2025-05-31 15:29 GMT

2025లో భారతదేశాన్ని ముందుగానే నైరుతి రుతుపవనాలు పలకరించాయి. నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రారంభమవ్వడంతో భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వాతావరణ పరిస్థితులను సూచిస్తూ విస్తృత హెచ్చరికలను జారీ చేసింది. దేశంలోని అనేక ప్రాంతాలలో అనూహ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, భారతదేశంలోని చాలా ప్రాంతాలు ఇప్పటికే జలమయం అయ్యాయి. ఈ వారాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేరళ లోని పలు జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడు, కర్ణాటక తీరప్రాంతం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలలో తుఫాను గాలులతో కూడిన పరిస్థితులు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


ఈశాన్య ప్రాంతంలో రుతుపవనాల ప్రారంభంలోనే విస్తృత వర్షాలు కురిశాయి. దీనివల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక జిల్లాలలో తీవ్రమైన నీటి ఎద్దడి, రవాణాకు అంతరాయం పెరిగింది. నదులలో నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో పలు గ్రామాల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. గౌహతిలో ప్రయాణికులు మోకాలి లోతు నీటిలో ఉండడం, వరద నీటిలో బస్సులు చిక్కుకుపోయి ట్రాఫిక్ నిలిచిపోయిన విజువల్స్ వైరల్ అయ్యాయి. సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో తీస్తా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నందున అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచింది.

ఇంతలో కొందరు వ్యక్తులు ఓ పడవలో వెళుతూ ఉండగా అది నీటిలో తిరగబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది భారతదేశంలో చోటు చేసుకున్నదంటూ నెటిజన్లు చెబుతూ ఉన్నారు.



వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వీడియోకు భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు.

వైరల్ పోస్టుల కింద కామెంట్స్ ను మేము నిశితంగా పరిశీలించాం. అందులో ఓ యూజర్ ఈ వీడియో భారత్ కు చెందినది కాదంటూ వివరణ ఇచ్చారు.



అంతేకాకుండా ఓ యూట్యూబ్ లింక్ ఇచ్చారు.

'Bote con pasajeros y carga excesiva se hunde en Madre de Dios' అనే టైటిల్ తో TVPerú Noticias అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియో భారత్ లో జరిగింది కాదని పెరులో తెలుస్తోంది.

Full View


ఇక వీడియోను పరిశోధించడానికి, మేము మొదట Google రివర్స్ ఇమేజ్‌లో వీడియో కీఫ్రేమ్‌లను శోధించాము. ఈ సమయంలో, Facebookలోని N60 Noticias ఖాతాలో ఒక వైరల్ వీడియోను మేము కనుగొన్నాము. ఈ వీడియో దాదాపు రెండు నెలల క్రితం మార్చిలో పోస్ట్ చేశారు. వీడియో శీర్షిక స్పానిష్ భాషలో ఉంది.

పంపా సెక్టార్‌లో బరువు ఎక్కువ అయిన కారణంగా పలువురిని తీసుకెళ్తున్న పడవ బోల్తా పడింది. అయితే, ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు లేదా తీవ్రంగా గాయపడలేదని తెలిపారు.

https://www.facebook.com/reel/1344829426659762


వీడియో టైటిల్ లో ఉపయోగించిన కీలకపదాలతో మేము వెతికాం. ఈ సమయంలో, మాకు ఓ వెబ్ సైట్ నివేదిక లభించింది. నివేదిక ప్రకారం, మాడ్రే డి డియోస్‌లోని లా పంపా ప్రాంతంలో ప్రయాణీకులు, మోటార్ సైకిళ్లను తీసుకెళ్తున్న పడవ ఓవర్‌లోడింగ్ కారణంగా మునిగిపోయిందని అందులో తెలిపారు.

https://www.tvperu.gob.pe/noticias/nacionales/madre-de-dios-embarcacion-se-hunde-por-exceso-de-carga


పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ బోట్ లో ఉన్న వారందరూ ఎటువంటి గాయాలు లేకుండా బయటపడగలిగారు. కొంతమంది ప్రయాణీకులు నదిలోని మురికి నీటిలో తమ వస్తువులను పోగొట్టుకున్నారు. ఆపరేటర్ నిర్లక్ష్యం వల్ల డజన్ల కొద్దీ ప్రజలు ప్రమాదంలో పడ్డారని, భవిష్యత్తులో ప్రమాదాలను నివారించడానికి నది రవాణాలో ఎక్కువ నియంత్రణలు అవసరమని ప్రజలు కోరారని అందులో నివేదించారు.

కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో భారతదేశానికి సంబంధించింది కాదు. భారత్ లో చోటు చేసుకున్న ఘటన అంటూ జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 


Claim :  ఈ వీడియోకు భారతదేశానికి ఎలాంటి
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News