ఫ్యాక్ట్ చెక్: 2026 జనవరిలో గరీబ్ రథ్ కోచ్ కు మంటలు అంటుకున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
2026 జనవరిలో గరీబ్ రథ్ కోచ్ కు మంటలు అంటుకున్నాయంటూ
2025, డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యలమంచిలి వద్ద టాటానగర్-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లోని రెండు కంపార్ట్‌మెంట్లు మంటల్లో చిక్కుకుని ఒక వ్యక్తి మృతి చెందాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. రైలు మంటల్లో చిక్కుకున్నప్పుడు ప్రభావితమైన ఒక కోచ్‌లో 82 మంది ప్రయాణికులు, మరొక కోచ్‌లో 76 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. బి1 కోచ్ నుండి ఒక మృతదేహం లభ్యమైంది. మృతుడిని చంద్రశేఖర్ సుందరంగా గుర్తించారు. దెబ్బతిన్న రెండు కోచ్‌లను ఎర్నాకుళం వైపు వెళ్లే రైలు నుండి వేరు చేశారు. దెబ్బతిన్న కోచ్‌లలోని ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపించారు. అగ్నిప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దింపారు.
లూథియానా నుండి ఢిల్లీకి వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయనే వాదనతో, ఒక రైలు బోగీ మంటల్లో చిక్కుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను చూపించే వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో 2026 జనవరిలో చోటు చేసుకున్న తాజా సంఘటనగా ప్రచారం చేస్తున్నారు. వైరల్ పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 2025 అక్టోబర్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన విజువల్స్ ను ఇటీవలివిగా వైరల్ చేస్తున్నారు.
మేము సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి లూథియానా నుండి ఢిల్లీకి వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఇటీవల మంటలు చెలరేగాయా? లేదా? అని తెలుసుకోడానికి ప్రయత్నించాం. అయితే ఎక్కడా కూడా అందుకు సంబంధించిన సమాచారం లభించలేదు.
వైరల్ వీడియో లోని కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ సెర్చ్ చేశాం. అక్టోబర్ 18, 2025న ‘రిపోర్ట్ భారత్’ అనే ఫేస్‌బుక్ పోస్ట్ మాకు కనిపించింది. ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌లో చూసిన అదే వీడియో ఇక్కడ ఉంది. గరీబ్ రథ్ రైలులో మంటలు చెలరేగాయని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఈ నివేదిక పేర్కొంది. దీన్ని బట్టి ఈ ఘటన ఇటీవల చోటు చేసుకుంది కాదని స్పష్టంగా తెలుస్తోంది.
https://www.facebook.com/
దీన్ని క్యూగా తీసుకొని గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ నిర్వహించగా. అక్టోబర్ 18, 2025న ఫతేఘర్ సాహిబ్‌లోని సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలోని అమృత్సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో మంటలు చెలరేగాయని పలు మీడియా నివేదికలు తెలిపాయి. ఆ నివేదికలకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ , ఇక్కడ చూడొచ్చు.
పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో అమృత్‌సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12204) రైలులోని ఒక కోచ్ మంటల్లో చిక్కుకోవడంతో ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారని ఈ నివేదికలు తెలిపాయి. ఈ సంఘటన ఉదయం జరిగిందని అధికారులు తెలిపారు. రైలు సిర్హింద్ స్టేషన్‌ను దాటుతుండగా జి-19 ఎసి కోచ్‌లో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. రైలుకు సిర్హింద్‌లో షెడ్యూల్ స్టాప్ లేకపోవడంతో అంబాలా కంటోన్మెంట్ కు వెళుతోంది. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఆర్‌పి), ఉత్తర రైల్వే సిబ్బంది, స్థానిక అగ్నిమాపక సిబ్బంది పెద్ద ప్రమాదాన్ని నివారించడానికి వేగంగా స్పందించాయి. మంటలను త్వరగా ఆర్పివేశారు. ప్రయాణీకులను సురక్షితంగా పక్కనే ఉన్న కోచ్‌లకు తరలించారు. తరలింపు సమయంలో ఒక మహిళా ప్రయాణీకురాలికి స్వల్ప కాలిన గాయాలు అయ్యాయి. ఆమెను ఫతేఘర్ సాహిబ్‌లోని సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. జిఆర్‌పి ఫతేఘర్ సాహిబ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రత్తన్ లాల్ మాట్లాడుతూ, "ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పేలుడు పదార్థాలు లేదా మండే పదార్థాలకు సంబంధించిన ఆధారాలు ఆ ప్రదేశంలో కనుగొనలేదు" అని తెలిపారు.
పలు యూట్యూబ్ ఛానల్స్ కూడా వైరల్ అవుతున్న వీడియోనే అప్లోడ్ చేశాయి.
Punjab News | Massive Fire Breaks Out In Garib Rath Express AC Coach, No Casualties Reported అనే టైటిల్ తో NDTV 18 అక్టోబర్ 2025న ఇదే వీడియోను అప్లోడ్ చేశాయి.
ఇక ఇండియా టుడే Garib Rath Express Coach Catches Fire in Punjab; Passengers Evacuated Safely | India Today News అనే టైటిల్ తో ఈ వీడియోను అప్లోడ్ చేసింది.
వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో అక్టోబర్ 2025 నాటిది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : 2026 జనవరిలో గరీబ్ రథ్ కోచ్ కు మంటలు అంటుకున్నాయంటూ
Claimed By : Social Media Users
Fact Check : Unknown