ఫ్యాక్ట్ చెక్: జపాన్ మెట్రో అధికారులు ట్రైన్ ను ప్రారంభించే ముందు హారతిని ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

జపాన్ మెట్రో అధికారులు ట్రైన్ ను ప్రారంభించే ముందు హారతిని ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారం

Update: 2026-01-07 03:33 GMT

భారతదేశంలో మెట్రో రైలు వ్యవస్థల్లో పలు మార్పులు వస్తున్నాయి. అయితే అంతే విధంగా సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి మెట్రో రైలు వ్యవస్థ తోడ్పడుతూ ఉంది. కానీ ముంబై, బెంగళూరు, కోల్‌కతాలలో చాలా తక్కువ రైళ్లు ఉండడం, చాలా మంది ప్రయాణికులు ఉండడంతో ఎన్నో ఇబ్బందులు తప్పడం లేదు.


భారతదేశ మెట్రో రైలు నెట్‌వర్క్ క్రమంగా విస్తరిస్తూనే ఉంది. ప్రస్తుతం RRTS కారిడార్‌లతో సహా దాదాపు 1,083 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 25 నగరాల్లో పనిచేస్తోందని గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. "ఢిల్లీ-మీరట్ నమో భారత్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కు సంబంధించిన 55 కిలోమీటర్లతో సహా 25 వేర్వేరు నగరాల్లో దాదాపు 1083 కిలోమీటర్ల మెట్రో రైలు లైన్లు పనిచేస్తున్నాయి" అని వివరించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రాజెక్టు ఆమోదాలు సాధ్యాసాధ్యాలు, వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటాయి, దీని వలన మెట్రో నిర్మాణాలకు ఖచ్చితమైన సమయాలను నిర్ణయించడం కష్టమవుతుందని తెలిపింది ప్రభుత్వం. మెట్రో, సబర్బన్ రైలు సేవలు వేగంగా విస్తరించినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి ఛార్జీల పెంపును అమలు చేయలేదని, ఇది పేదలు, మధ్యతరగతి ప్రయాణికుల కోసం తీసుకున్న చర్యలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారతదేశంలో 2002లో మెట్రో సేవలు కేవలం 27 కి.మీ.లకు నడిచాయి, ఇది 2004లో 50 కి.మీ., 2009లో 101 కి.మీ., 2014లో 249 కి.మీ., 2019లో 647 కి.మీ., 2024లో 945 కి.మీ., 2025లో 1,090 కి.మీ.లకు పెరిగింది.

అయితే జపాన్ లో మెట్రో అధికారులు నూతనంగా ప్రారంభించిన రైళ్లకు హారతిని ఇచ్చే సంప్రదాయాన్ని పాటించారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పువ్వులు, ఓం, స్వస్తిక్ గుర్తుతో అలంకరించిన రైలు ముందు ప్రజలు హారతి ఇస్తూ, కొబ్బరికాయను పగలగొడుతున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తున్న వినియోగదారులు ఇది జపాన్ నుండి వచ్చిందని తెలిపారు.

https://www.youtube.com/shorts/J8gJ7HEqJ1s?feature=
share


https://www.instagram.com/reels/DHiVakuJ_Vu/

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు

వైరల్ స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు 


 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో బెంగళూరుకు చెందినది. వైరల్ అవుతున్న వీడియో 2024 నాటిది. అది కూడా బెంగళూరు మెట్రోలో చోటు చేసుకున్నది.

వైరల్ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను తీసుకుని మేము గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. మాకు మార్చి 9న ‘BENGALORE YELLOW LINE DRIVERLESS METRO POOJA’ అనే టైటిల్ తో అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్ లో లభించింది.

Full View


దీన్ని క్యూగా తీసుకుని సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా పలు మీడియా కథనాలు 2024, ఫిబ్రవరి, మార్చి నెలల్లో బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు గురించి ప్రస్తావించాయి.

దక్షిణ బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని హెబ్బగోడి డిపోకు నమ్మ మెట్రో(బెంగళూరు మెట్రో) కోసం మొదటి డ్రైవర్‌లెస్ రైలు చేరుకుందని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ప్రకటించింది. ఈ ఆరు కోచ్‌ల ప్రోటోటైప్ రైలు 19.15 కి.మీ ఎల్లో లైన్‌లో ట్రయల్ రన్‌లను నిర్వహిస్తుంది, ఇది జయదేవ హాస్పిటల్, సిల్క్ బోర్డ్ జంక్షన్, ఎలక్ట్రానిక్స్ సిటీ ద్వారా RV రోడ్‌ను బొమ్మసంద్రతో కలుపుతుంది. చైనాకు చెందిన CRRC నాన్జింగ్ పుజెన్ కో లిమిటెడ్ తయారు చేసిన ఈ రైలుకు BMRCLకి 216 కోచ్‌లను సరఫరా చేయడానికి 2019లో రూ. 1,578 కోట్ల కాంట్రాక్ట్ అందుకుంది. ఈ రైలు జనవరి 24న చైనా నుండి బయలుదేరి ఫిబ్రవరి 6న చెన్నై పోర్టుకు చేరుకుంది. అన్‌లోడింగ్, కస్టమ్స్ క్లియరెన్స్ తర్వాత, రైలును రోడ్డు మార్గం ద్వారా బెంగళూరుకు రవాణా చేశారు. అందుకు సంబంధించిన కథనాలను
ఇక్కడ
, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


ఇక వైరల్ అవుతున్న వీడియో లోని రైలు స్క్రీన్‌పై "బెంగళూరు మెట్రోకు స్వాగతం" అని ఉన్న టెక్స్ట్ ను కూడా మేము గమనించాము, ఇది వీడియో జపాన్ నుండి కాదని నిర్ధారిస్తుంది. హారతి ఇచ్చే వ్యక్తులు తమ చొక్కాల వెనుక 'CRRC' అని రాసి ఉంది. ఇక వీడియోలో మాట్లాడింది భారతీయ భాషలే అని తెలుస్తోంది.



 




 



కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  జపాన్ మెట్రో అధికారులు ట్రైన్ ను ప్రారంభించే ముందు హారతిని ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారం
Claimed By :  social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News