ఫ్యాక్ట్ చెక్: 2017లో జరిగిన రాళ్లదాడి ఘటనను నోయిడాలో ఇటీవల చోటు చేసుకున్నదిగా ప్రచారం చేస్తున్నారు

2017 లో జరిగిన సంఘటనకు సంబంధించిన విజువల్స్

Update: 2025-07-23 11:30 GMT

ఈ కాలంలో ఇళ్లల్లో పని చేసే వారికి సంబంధించి డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతూ ఉంది. కొన్ని కొన్ని సార్లు వారు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? అనే విషయాలను పట్టించుకోకుండా పనిలో పెట్టేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది.

సెక్యూరిటీ గార్డులకు, కొంతమంది వ్యక్తులకు మధ్య జరిగిన ఘర్షణను చిత్రీకరించే వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉంది. ఈ ఘర్షణలో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల నోయిడాలోని ఒక నివాస సముదాయంలో ఈ ఘర్షణ జరిగిందని, దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ ముస్లిం కారణంగా ఈ ఘర్షణ జరిగిందని చెబుతున్నారు. నివాసితులు ఆ పనిమనిషిని దొంగతనం ఆరోపణల కారణంగా అదుపులోకి తీసుకున్న తర్వాత, ఆమె వర్గానికి చెందిన మహిళలు దాడి చేసి అల్లర్లు సృష్టించారని పోస్టుల్లో ఆరోపించారు.

ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో “ నోయిడాలోని పోష్ కాలనీ మహాగున్ సొసైటీ. బంగ్లాదేశ్ ముస్లిం మహిళ ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో కొన్ని వస్తువులు కనిపించకుండా పోయాయని, ₹10,000 కూడా అదృశ్యమవ్వడంతో ఓనర్ ఆమెను అడిగింది…. మొదట, పనిమనిషి నిరాకరించింది, కానీ దొంగతనం చేస్తున్నప్పుడు సిసిటివి రికార్డింగ్‌ రుజువు ఉందని కుటుంబం చెప్పినప్పుడు, ఆమె దొంగతనం అంగీకరించింది. మరియు మరుసటి రోజు డబ్బు తీసుకురావాలని కోరడమే కాకుండా, ఈ విషయాన్ని ఆ కుటుంబం సొసైటీకి తెలిపింది. సమీపంలోని బంగ్లాదేశ్ సెటిల్‌మెంట్ నుండి చాలా మంది మహిళలు సొసైటీలో పని చేస్తున్నారు. మరుసటి రోజు నుండి మొత్తం సొసైటీ వారిని పనికి రాకుండా అడ్డుకుంది. ఫలితంగా… జూలై 12న ఉదయం 6 గంటలకు, ఆ మహిళ బంగ్లాదేశ్ సెటిల్‌మెంట్ నుండి వందలాది మందితో మహాగున్ సొసైటీకి చేరుకుంది. ఆ గుంపు మొత్తం సొసైటీని భయభ్రాంతులకు గురిచేస్తోంది. విధ్వంసం ప్రారంభమైంది. మిగిలినవి మీరు వీడియోలో చూడవచ్చు మీరు ఈ సంఘటన నుండి ఒక గుణ పాఠం నేర్చుకోవాలి, ఈ బంగ్లాదేశీయులను మీ ఇళ్ల నుండి తొలగించండి, లేకుంటే ఏదో ఒక రోజు మీరు కూడా బాధపడతారు. వారిని మన ఇళ్లలోకి అనుమతిస్తోంది మనమే” అంటూ షేర్ చేశారు.


Full View

Full View





వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ఇటీవలిది కాదు. 2017లో చోటు చేసుకున్న ఘటన.

మేము సంబంధిత కీవర్డ్స్ తో వెతికినప్పుడు ఇటీవలి కాలంలో నోయిడాలో అటువంటి సంఘటనను ధృవీకరించే విశ్వసనీయ వార్తలు మాకు లభించలేదు.

వీడియో కీఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఆ ఫుటేజ్ ఇటీవలిది కాదని, 2017లో చోటు చేసుకున్న ఘటన అని తేలింది.

"Violent mob, conflicting versions and FIRs: All you need to know about Noida society stone-pelting case" అంటూ ఇండియా టుడేలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జులై 13, 2017న నివేదించారు.

నోయిడాలోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌పై కోపంతో ఉన్న గృహ కార్మికుల గుంపు నిరసన తెలిపి రాళ్లు రువ్వారు. సెక్టార్-78లోని మహాగున్ మోడెరీన్ సొసైటీలో పరిస్థితి తీవ్రతను చూపించే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నివాసితులలో ఒకరు పని మనిషిపై దాడి చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు రాడ్‌లతో నివాస సముదాయంలోకి ప్రవేశించారు. ఈ సంఘటనకు సంబంధించి రెండు వెర్షన్లు ఉన్నందున రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.

పని మనిషి చెబుతోంది:
మహాగున్ మోడరన్ సొసైటీలో పనిమనిషిగా పనిచేస్తున్న 26 ఏళ్ల జోహ్రా బీబీ తన జీతం విషయంలో యజమానితో గొడవ పడింది. ఆమె ప్రకారం, ఆమె రెండు నెలల జీతం రూ. 12,000 డిమాండ్ చేసింది, కానీ చెల్లించడానికి బదులుగా, యజమానులు ఆమె రూ. 17,000 దొంగిలించిందని ఆరోపించారు. జోహ్రా బీబీ తనను కొట్టారని, భయపడి అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ బేస్‌మెంట్‌కు పారిపోయానని చెప్పింది.

యజమాని చెబుతోంది:
జోహ్రా యజమాని హర్షు సేథి మీడియాతో మాట్లాడుతూ గత ఆరు నెలలుగా తన పర్సు నుండి తరచుగా డబ్బు దొంగిలిస్తున్నట్లుగా ఆరోపించారు. కానీ ఇటీవల, ఆమె రూ. 17,000 దొంగిలించబడినట్లు గుర్తించినప్పుడు జోహ్రాను ప్రశ్నించారు. హర్షు జోహ్రాతో మాట్లాడుతూ, డబ్బు దొంగిలించడం సీసీటీవీ కెమెరాలో రికార్డయిందని చెప్పారు. జోహ్రా నేరం ఒప్పుకుంది. రూ.10,000 తీసుకున్నానని అంగీకరించింది, తన జీతంలో పట్టుకోవాలని కోరింది. జోహ్రా ఈ విషయాన్ని మేనేజ్‌మెంట్‌కు నివేదించవద్దని, ఇతర ఫ్లాట్‌లలో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనను పలు మీడియా సంస్థలు 2017లోనే నివేదించాయి. ఆ ఘటనకు సంబంధించిన నివేదికలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

ఇక వైరల్ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను తీసుకుని సెర్చ్ చేయగా అదే వీడియోలు మాకు లభించాయి.

Full View


Full View


Full View


కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో 2017 నుండి ఆన్ లైన్ లో ఉందని మేము ధృవీకరించాం.


Claim :  2017లో జరిగిన రాళ్లదాడి ఘటనను నోయిడాలో ఇటీవలి చోటు చేసుకున్నదిగా
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News