ఫ్యాక్ట్ చెక్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP విజయం సాధించగానే యమునా హారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే ప్రచారం నిజం కాదు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 స్థానాలను కైవసం చేసుకుని 26 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారాన్ని

Update: 2025-02-13 13:09 GMT

Yamuna Aarti in Delhi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 స్థానాలను కైవసం చేసుకుని 26 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడ్డాయి. త్వరలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నందున, ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై దృష్టి సారించింది. ఎవరు తదుపరి సీఎం అనే విషయమై సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. కులాలు, ఉప వర్గాల వారీగా ఓట్ల భాగస్వామ్య విధానాలతో సహా పలు అంశాల ఆధారంగా బీజేపీ అధిష్టానం ఎవరికి పగ్గాలు అప్పజెప్పాలా అనే విషయమై చర్చలు జరుపుతూ ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకరి కంటే ఎక్కువ మంది ఉపముఖ్యమంత్రుల ఎంపిక కూడా సాధ్యమేనని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా, ఢిల్లీలో బీజేపీ విజయం తర్వాత యమునా నది ఒడ్డున ఆరతి నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. “दिल्ली में आज पहली बार यमुना जी की आरती देखने को मिली. आशा यही है कि दिल्ली वालों को अब जमुना जी की आरती देखने को मिले. अर्थात अब दिल्ली जल्दी ही इंद्रप्रस्थ बनेगी #मां_यमुना_जी అనే వాదనతో వీడియోను పోస్టు చేస్తున్నారు. "ఈరోజు ఢిల్లీలో మొదటిసారిగా, యమునా ఆరతి కనిపించింది ఇప్పుడు ఢిల్లీవాసులు యమునా ఆర్తిని చూడగలరని ఆశిస్తున్నాము ఢిల్లీ త్వరలో ఇంద్రప్రస్థంగా మారుతుంది" అని ఆ పోస్టుల్లో ఉంది.



వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.


 


ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంది. ఢిల్లీలోని ఘాట్‌లలో యమునా హారతి నిర్వహిస్తున్నట్లు వీడియో చూపించినప్పటికీ, ఢిల్లీలో హారతి జరగడం ఇదే మొదటిసారి కాదు. యమునా హారతి 2024లోనే ప్రారంభమైంది.
యమునా హారతి గురించిన నివేదికల కోసం వెతికినప్పుడు, 'రాజ్ నివాస్ ఢిల్లీ' అనే ఛానెల్ ప్రచురించిన యూట్యూబ్ వీడియో 
మాకు లభించింది
, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్ కు సంబంధించిన అధికారిక YouTube ఛానెల్. రామమందిరప్రాణప్రతిష్ట సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీలోని వాసుదేవ్ ఘాట్ వద్ద యమునా హారతి చేస్తున్న దృశ్యాలని అందులో తెలిపారు.
Full View
యుట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో యమునా హారతిని ప్రదర్శిస్తున్నట్లు మేము కనుగొన్నాము, ఇది సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంతో కూడిన నగరం, యాత్రికులు, సందర్శకుల కోసం కొత్త గమ్యస్థానాన్ని అందిస్తుందని తెలిపారు. వాసుదేవ్ ఘాట్ వద్ద యమునా ఆరతిని వీక్షించవచ్చని, 12 మార్చి 2024న ప్రారంభించినట్లుగా తెలిపారు. వజీరాబాద్ నుండి ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వరకు యమునా నది వెంబడి 66 హెక్టార్ల ఘాట్‌లను పునరుద్ధరించారు. వాసుదేవ్ ఘాట్‌లోని యమునా హారతిని సందర్శించి ఆనందించడానికి అవసరమైన సమయాలు, టిక్కెట్ ధరలు, ఈవెంట్‌లకు సంబంధించిన సమాచారం కూడా అందించారు.
Full View
యమునా ఘాట్, నిగమ్ బోద్ ఘాట్ మధ్య యమునా పశ్చిమ తీరం వెంబడి ఉన్న వాసుదేవ్ ఘాట్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) వికె సక్సేనా సాయంత్రం హారతితో ప్రారంభించారని హిందూస్తాన్ టైమ్స్‌లో ప్రచురించిన కథనంచూడొచ్చు. మార్చి 2024లో యమునా ఆరతి ప్రారంభించినట్లు ప్రచురించిన నివేదికలను కూడా మేము కనుగొన్నాము.
యమునా హారతి మొదటిసారిగా నిర్వహిస్తున్నారనే వాదన తప్పుదారి పట్టించేది. ఢిల్లీలో ఆప్ హయాంలో కూడా యమునా హారతి నిర్వహించేవారు.
Claim :  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించగానే యమునా హారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News